దుల్కర్ స్పీడ్‌కు బ్రేకుల్లేవ్!

ABN , Publish Date - Jun 17 , 2026 | 06:34 PM

మల్లూవుడ్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ జోరు మీదున్నాడు. సొంత ఇండస్ట్రీ కంటే కూడా టాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. లోకల్ హీరోలను మించిన ఆఫర్లను అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా హీరోలు అన్ని భాషల్లోనూ తమ మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు. టాలీవుడ్ హీరోలు ఇప్పటికే ఆ ట్రెండ్ ఫాలో అవుతుండగా మళయాళ సీనియర్‌ స్టార్ హీరో మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టాడు. తాజాగా టాలీవుడ్‌లో మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టి హాట్ టాపిక్‌గా మారాడు.


2018లో 'మహానటి' చిత్రంలో జెమినీ గణేషన్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్, ఆ తర్వాత 'సీతారామం'తో తెలుగులో తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకోవడంతో పాటు ఒక క్లాసిక్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆపై 'లక్కీ భాస్కర్'తో బాక్సాఫీస్ వద్ద మరో విజయాన్ని అందుకుని టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పూజా హెగ్డే హీరోయిన్‌గా, రవి నెలకుడితి దర్శకత్వంలో దుల్కర్‌ ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత రెండు తెలుగు సినిమాలు చేయబోతున్నాడు దుల్కర్ సల్మాన్‌.

నటుడు నాని నిర్మాణ సంస్థ 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌లో 'కోర్ట్' దర్శకుడు జగదీష్‌తో దుల్కర్‌ ఒక సినిమాకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే 'దండోరా' దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ తో మరో సినిమాకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా తెలుగు ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తుండటంతో దుల్కర్ సల్మాన్ మల్లూవుడ్ ను వదిలి టాలీవుడ్‌లోనే స్థిరపడతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇవి కూడా చదవండి:

ప్రధాని మోదీ వీడియోలో.. అల్లు అర్జున్‌ AA23 థీమ్.. దేశవ్యాప్తంగా వైరల్

తల్లి కాబోతున్న సమంత..

ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్

Updated Date - Jun 17 , 2026 | 06:40 PM