లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్న స్టార్ డైరెక్టర్
ABN , Publish Date - Mar 02 , 2026 | 06:52 PM
మలయాళ స్టార్ డైరెక్టర్ చిదంబరం (Chidambaram) వివాదంలో చిక్కుకున్నారు. మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయనపై ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
మలయాళ స్టార్ డైరెక్టర్ చిదంబరం (Chidambaram) వివాదంలో చిక్కుకున్నారు. మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయనపై ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కేరళలోని ఎర్నాకుళం పోలీస్ స్టేషన్ లో చిదంబరంపై కేసు నమోదు అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిదంబరం.. 2022 లో తనను లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు చిదంబరాన్ని విచారణకు హాజరుకావాలని జారీ చేశారు. ఇప్పటివరకు ఈ వివాదంపై డైరెక్టర్ స్పందించలేదు.
జాన్ ఈ మ్యాన్ అనే సినిమాతో చిదంబరం డైరెక్టర్ గా కెరీర్ ను మొదలు పెట్టారు. 2024 లో మంజుమ్మల్ బాయ్స్ సినిమా ఆయనకు భారీ విజయాన్ని అందించింది. ప్రస్తుతం 'బాలన్' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న చిదంబరం త్వరలోనే హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలాంటి సమయంలో లైంగిక ఆరోపణలు రావడం ఆయన కెరీర్ ను రిస్క్ లో పడేసినట్లే అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే కేసు పెట్టిన ఆ మహిళ ఎవరు.. ? నటినా.. ? లేక టెక్నీషియనా..? అని కొందరు ఆరాలు తీస్తున్నారు. ఇకపోతే మలయాళ ఇండస్ట్రీలో చాలామంది నటులు, డైరెక్టర్లు ఇలాంటి లైంగిక వేధింపుల కేసులను ఎదుర్కొంటున్నవారే. మరి చిదంబరం కేసు ఎలా ముగుస్తుందో చూడాలి.