సునీల్ మ‌ల‌యాళ సినిమా.. డ్యాన్స్ ఇర‌గ‌దీశాడుగా

ABN , Publish Date - Feb 15 , 2026 | 10:17 PM

అంటోని వ‌ర్గీస్, దుషారా విజ‌య‌న్ జంట‌గా తెర‌కెక్కుతున్న మ‌ల‌యాళ యాక్ష‌న్‌ చిత్రం కాటాల‌న్.

sunil

అంటోని వ‌ర్గీస్ (Antony Varghese), దుషారా విజ‌య‌న్ (Dushara Vijayan) జంట‌గా తెర‌కెక్కుతున్న మ‌ల‌యాళ యాక్ష‌న్‌ చిత్రం కాటాల‌న్ (Kattalan). పాల్ జార్జ్ (Paul George) ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తోండ‌గా సునీల్ (Sunil), క‌బీర్ దుహాన్ సింగ్ (Kabir Duhan Singh) కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేలో పాన్ ఇండియాగా థియేట‌ర్ల‌కు రానుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మ‌జాకో మ‌ల్లికా (Majako Mallika) అంటూ సాగే ఓ క్ల‌బ్ సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. రాంబాబు గోసాల (RamBabu Gosala) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా అజ‌నీశ్ లోక‌నాథ్ (Ajaneesh Loknath ) సంగీతంలో అరుణ్ కౌండిన్య (Arun Koudinya), స‌మీర (Sameera) ఆల‌పించారు.

అయితే సినిమాలో పెద్ద డాన్‌గా చేస్తున్న సునీల్ పైనే ఈ పాట‌ను పూర్తిగా చిత్రీక‌రించ‌డం విశేషం. అంతేగాక‌ ఆయ‌న కంటూ ప్ర‌త్యేకమైన డ్యాన్స్‌ స్టెప్పులు క్రియేట్ చేసి పెట్ట‌డం గ‌మ‌నార్హం. స్వ‌త‌హాగా మంచి డ్యాన్సర్ అయిన సునీల్ ఈ పాట‌లో డ్యాన్స్‌తో ఇర‌గ‌దీశాడు. త‌న టాలెంట్‌ను మ‌ల్లు వుడ్‌కు రుచి చూపించాడు. ప్ర‌స్తుతం ఈ పాట నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

Updated Date - Feb 15 , 2026 | 10:17 PM