రూ.1.50 కోట్లు జరిమానా విధింపు సమంజసమేనన్న హైకోర్టు
ABN , Publish Date - Feb 07 , 2026 | 09:19 AM
'పులి' (Puli Movie) చిత్రంలో నటించినందుకు తీసుకున్న పారితోషికంలో రూ.15 కోట్లు తగ్గించి చూపించినందుకు ఆదాయపు పన్ను శాఖ నటుడు విజయ్ కి రూ.1.50 కోట్ల మేరకు జరిమానా (Vijay) విధించడం సమంజసమేనని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
'పులి' (Puli Movie) చిత్రంలో నటించినందుకు తీసుకున్న పారితోషికంలో రూ.15 కోట్లు తగ్గించి చూపించినందుకు ఆదాయపు పన్ను శాఖ నటుడు విజయ్ కి రూ.1.50 కోట్ల మేరకు జరిమానా (Vijay) విధించడం సమంజసమేనని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఆ జరిమానా విధింపును వ్యతిరేకిస్తూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. 2015లో విజయ్ నివాస గృహంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టి కీలకమైన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించి నప్పుడు విజయ్ 'పులి' చిత్రానికి తీసుకున్న పారితోషికంలో రూ.15 కోట్లదాకా తగ్గించి చూపినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో 2022లో విజయ్ కి ఆదాయాన్ని దాచిన నేరానికి ఐటీ శాఖ రూ.1.5 కోట్ల మేరకు జరిమానా విధించింది.
ఆ జరిమానాను వ్యతిరేకిస్తూ విజయ్ మద్రాసు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయపు పన్ను శాఖ ఆ జరిమానా 2019 జూన్ 30కి ముందు విధించి ఉండాలని, మూడేళ్ల తర్వాత 2022లో ఉత్తర్వులు జారీ చేయటం చట్ట ప్రకారం తప్పిదమని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ అనంతరం విజయ్ పై ఆదాయపు పన్ను శాఖ జరిమాన విధించడంలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని హైకోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పులో స్పష్టం చేసింది. విజయ్ పిటిషన్ తోసిపుచ్చుతు న్నట్లు ప్రకటించింది. ఈ తీర్పుపై విజయ్ అప్పీలుకు వెళ్లేందుకు షరతులతో కూడిన వెసులుబాటు కల్పించింది.