Lokesh Kanagaraj: ఆగిన ఖైదీ 2.. లోకేశ్ ఏమన్నాడంటే
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:27 PM
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj) .. గతేడాది కూలీ సినిమాతో మొదటి పరాజయాన్ని అందుకున్నాడు. దీంతో అతనిపై చాలా ట్రోలింగ్ నడిచింది.
Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj) .. గతేడాది కూలీ సినిమాతో మొదటి పరాజయాన్ని అందుకున్నాడు. దీంతో అతనిపై చాలా ట్రోలింగ్ నడిచింది. అయినా కూడా లోకేష్ ఆగకుండా వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. గత కొన్నిరోజులుగా ఖైదీ 2 (Kaithi 2) ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్ (Allu Arjun) తో సినిమా చేస్తుండడంతో ఖైదీ 2 ఆగిపోయిందని, అంతేకాకుండా సీక్వెల్ కి ఎక్కువ పారోతోషికం అడగడంతో మేకర్స్ కి, లోకేష్ కి మధ్య విభేదాలు రావడంతో ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా లోకేష్ ఈ రూమర్స్ పై స్పందించాడు. ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు.
'ఖైదీ 2 ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. కచ్చితంగా ఆ సీక్వెల్ తెరకెక్కిస్తాను. ఖైదీ 2 కోసం కార్తీ సర్ ఇచ్చిన డేట్స్ ను వేరే డైరెక్టర్ తీసుకున్నారు. ఈలోపు నేను అల్లు అర్జున్ సినిమాను ఫినిష్ చేయాలనీ ఈ సినిమా చేస్తున్నా కానీ, ఖైదీ 2 ఆగిపోలేదు. అల్లు అర్జున్ సినిమా తరువాత ఆ సీక్వెల్ ఉంటుంది. ఆరేళ్ళ క్రితమే మైత్రీ మూవీ మేకర్స్ లో ఒక సినిమా చేస్తానని కమిట్ మెంట్ ఇచ్చాను.. అందులో భాగంగానే బన్నీ సినిమా వస్తుంది.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎప్పటికీ క్లోజ్ అవ్వదు. అందులో సినిమాలు వస్తాయి. ప్రస్తుతం బెంజ్ సినిమా కూడా LCUలో భాగమే. అందులో సినిమాలు వస్తూనే ఉంటాయి.. రోలెక్స్ కూడా తెరకెక్కుతుంది. కూలీ తరువాత రజినీ- కమల్ తో ఒక సినిమా చేయమని అడిగారు. దానికి ముందే ఖైదీ 2 స్క్రిప్ట్ పనుల్లో ఉంది. అయినప్పటికీ రజినీ- కమల్ కోసం కష్టపడి ఒక కథను రెడీ చేశాను. అయితే వరుసగా వారిద్దరూ యాక్షన్ సినిమాలు చేస్తుండడంతో కథ నచ్చినా కూడా కొత్త జానర్ ని ఆశిస్తున్నారని అర్థమై ఆ సినిమా నుంచి పక్కకు వచ్చేశానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.