ఇండస్ట్రీలో విషాదం.. నిర్మాత ఆర్. బి. చౌదరి మృతి
ABN , Publish Date - May 05 , 2026 | 07:09 PM
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, తమిళ్ హీరో జీవా తండ్రి ఆర్. బి. చౌదరి (RB Choudary) మరణించారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, తమిళ్ హీరో జీవా తండ్రి ఆర్. బి. చౌదరి (RB Choudary) మరణించారు. కొద్దిసేపటి క్రితమే ఉదయ్ పూర్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది.
ఆర్. బి. చౌదరి పూర్తిపేరు.. రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు ఉక్కు ఎగుమతులు, ఆభరణాల పరిశ్రమలో పనిచేశారు. 1989లో ఆర్. బి. చౌదరి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మలయాళంలో పలు సినిమాలు నిర్మించాక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ను స్థాపించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో దాదాపు 98 సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో 99 వ సినిమాగా మకుటం తెరకెక్కుతోంది. విశాల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెట్స్ పై ఉంది.
ముఖ్యంగా తెలుగులో సూపర్ గుడ్ ఫిల్మ్స్ .. ఎన్నో మంచి విజయాలను అందుకుంది. పుదు వసంతం సినిమాను తెలుగులో నవ వసంతం అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాతోనే ఆర్. బి. చౌదరి టాలీవుడ్ కి ఎంటర్ అయ్యారు. ఆ తరువాత శరత్ కుమార్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'కెప్టెన్' మూవీని ఆర్.బి. చౌదరి డైరెక్ట్ గా తెలుగులో నిర్మించారు. ఆ పైన సుస్వాగతం, సూర్యవంశం, రాజా, శీను, నువ్వు వస్తావని, సింహరాశి, నిన్నే ప్రేమిస్తా, సంక్రాంతి, అందాల రాముడు, అన్నవరం, తరుణ్ నవ వసంతం, రచ్చ, గోరింటాకు, ఇష్క్, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలను నిర్మించారు.
ఆర్. బి. చౌదరికి నలుగురు కుమారులు. సురేష్, జీవన్, జితన్ రమేష్, జీవా. సురేష్.. తండ్రిలానే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. జీవన్.. తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నాడు. రమేష్.. 2010 లో విద్యార్థి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆశించిన విజయం దక్కక ప్రస్తుతం సోదరుడితో కలిసి బిజినెస్ చేస్తున్నాడు. చివరి కుమారుడు జీవా.. కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఆర్. బి. చౌదరి మరణించారు అన్న వార్త తెలియడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.