శ‌ర‌వ‌ణ‌న్.. యాక్ష‌న్ సీన్లు అద‌ర‌గొట్టాడుగా...

ABN , Publish Date - Mar 30 , 2026 | 06:15 AM

కొద్ది విరామం త‌ర్వాత ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, న‌టుడు శరవణన్ (Legend Saravanan) హీరోగా నటించిన కొత్త సినిమా ‘లీడర్‌’.

Saravanan

కొద్ది విరామం త‌ర్వాత ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, న‌టుడుశరవణన్ (Legend Saravanan) హీరోగా నటించిన కొత్త సినిమా ‘లీడర్‌’ (Leader ). పాయల్‌ రాజ్‌పుత్ (Payal Rajput) ఇందులో హీరోయిన్‌. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌ కుమార్ (R. S. Durai Senthilkumar) దర్శకత్వం వహిస్తున్నారు. లెజెండ్‌ శరవణ స్టోర్స్‌ ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు.

ట్రైన్‌లో జరిగే ఓ భారీ యాక్షన్‌ సీన్‌తో ఇది ప్రారంభమవుతుంది. ‘ఈ ప్రపంచంలో ఏ సహాయం దేవుడు నేరుగా చేయడు. మనుషుల మూలంగానే మంచి పనులు జరుగుతాయి. మనం వాళ్లనే నమ్మాలి’ అనే డైలాగ్‌ కథానాయకుడి ఆలోచనను, దృక్పథాన్ని తెలియజేస్తుంది. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఆకట్టుకునేలా చిత్రీకరించారు. ట్రైలర్‌ చివరలో వచ్చిన తండ్రీ, కూతురు భావోద్వేగ సన్నివేశం హృదయాన్ని తాకేలా ఉంది.

Updated Date - Mar 30 , 2026 | 07:56 AM