Toxic: టాక్సిక్.. లేడీస్ అండ్ లేడీస్ గ్లింప్స్ అదిరింది
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:34 PM
కేజీఎఫ్ వంటి బ్లాక్బస్టర్ హిట్స్ తర్వాత కన్నడ స్టార్ రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటించిన చిత్రం టాక్సిక్.
కేజీఎఫ్ వంటి బ్లాక్బస్టర్ హిట్స్ తర్వాత కన్నడ స్టార్ రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటించిన చిత్రం టాక్సిక్ (Toxic). ఒకపప్పటి హీరోయిన్ గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహించిన ఈ మూవీ చాల రోజుల క్రితమే రిలీజ్‌కు రెడీ అయిపలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే.. ఎట్టకేలకు ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇస్తూ మేకర్స్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఇప్పటివరకు సినిమా నుంచి గ్లింప్స్, టీజర్ వంటి వాటిని విడుదల చేసిన మేకర్స్ సినిమాలో నటించిన కథానాయికల పాత్రల గురించి ఎక్కడా రివీల్ చేయలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం బుధవారం రోజున సినిమాలో నటించిన హీరోయిన్ల పాత్రలను రివీల్ చేస్తూ లేడీస్ అండ్ లేడీస్ (Ladies & Ladies) అంటూ ఓ ఆసక్తికరమైన గ్లింప్స్ విడుదల చేశారు. నిమిషం 41 సెకండ్ల పాటు ఉన్న వీడియో అరంభం కావడమే పిల్లలు దూరంగా ఉండండి, తల్లిదండ్రులు పిల్లలను దూరంగా ఉంచండి, గ్రాండ్ పేరేంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ మీ ఓన్ రిస్క్‌పై మాత్రమే ఈ వీడియోను చూడండి అంటూ వార్నింగ్ మెసేజ్ పైతం ఇచ్చారు.
ఇక గ్లింప్స్‌లో బుల్లెట్‌పై నయనతార (Nayanthara) వచ్చే సీన్లు, కియారా (Kiara Advani), తారా సుతారియా (Tara Sutaria) రొమాంటిక్ లుక్స్, యాక్షన్ మోడ్‌లో రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth), హుమా ఖురేషీ (Huma Qureshi) చివరలో ఫారెన్ లేడీ ఫైటర్స్ సీన్స్ అదిరిపోయాయి. అంతేగాక ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను థియేటర్లకు తీసుకు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం ఈ వీడియో నేషనల్ వైడ్‌గా టాప్‌లో వైరల్ అవుతోంది. మీరూ ఓ నజర్ వేయండి.