తండ్రి అయిన 'జెర్సీ' నటుడు

ABN , Publish Date - Mar 02 , 2026 | 07:43 PM

కోలీవుడ్ హీరో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan) అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. తన భార్య నర్మద మార్చి 2 న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు.

Harish Kalyan

కోలీవుడ్ హీరో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan) అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. తన భార్య నర్మద మార్చి 2 న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఈ అద్భుతమైన విషయాన్ని అభిమానులతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. ' నా భార్య నర్మద, నేను ఈరోజు (02.03.2026) మా ఆడపిల్లను స్వాగతించామనే అద్భుతమైన వార్తను పంచుకున్నప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. తల్లి, కుమార్తె ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

మేము కలిసి ఈ అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు మాకు అండగా నిలిచిన మా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పత్రికలు, మీడియా వారి నిరంతర మద్దతు.. దయకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము' అంటూ తెలిపారు. ఇక ఈ వార్త తెలియడంతో అభిమానులు హరీష్ కళ్యాణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

హరీష్ కళ్యాణ్.. తెలుగువారికి కూడా సుపరిచితమే. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా ద్వారా హరీష్ కళ్యాణ్ తెలుగుకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో నాని కొడుకుగా ఆయన కనిపించారు. ఆ తరువాత తమిళ్ లో ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించారు. 2022 లో హరీష్ .. నర్మదా ఉదయ్ కుమార్ ని వివాహమాడారు. నాలుగేళ్ళ తరువాత ఈ జంట తమ మొదటి బిడ్డను ఆహ్వానించారు. ప్రస్తుతం హరీష్ కళ్యాణ్ దాషమకాన్ సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా హరీష్ కళ్యాణ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Updated Date - Mar 02 , 2026 | 08:00 PM