Toxic: యష్ తో బోల్డ్ సీన్స్.. రివర్స్ అయిన కియారా

ABN , Publish Date - May 02 , 2026 | 03:15 PM

Toxic: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో యశ్ (Yash) టాక్సిక్ (Toxic)ఒకటి. కెజిఎఫ్ 2 తరువాత చాలా గ్యాప్ తీసుకొని యశ్ చేస్తోన్న చిత్రం.

Toxic

Toxic: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో యశ్ (Yash) టాక్సిక్ (Toxic)ఒకటి. కెజిఎఫ్ 2 తరువాత చాలా గ్యాప్ తీసుకొని యశ్ చేస్తోన్న చిత్రం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తోన్న. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని బావుంటే జూన్ 4 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ, కొన్ని కారణాల వలన టాక్సిక్ జూన్ 4 నుంచి తప్పుకుంది.


టాక్సిక్ కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాక్సిక్ లో ఒక హీరోయిన్ అయిన కియారా అద్వానీ.. తాను నటించిన బోల్డ్ సీన్స్ ని ట్రిమ్ చేయాలని మేకర్స్ ని కోరినట్లు టాక్ నడుస్తోంది. యశ్, కియారా మధ్య బోల్డ్ సీన్స్ చాలా హైలైట్ గా నిలవనున్నాయని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాబాహి సాంగ్ లో కూడా వీరిద్దరి రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుంది. అది రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా కనిపిస్తుంది. అయితే దీనికి మించి సినిమాలో బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయట. ఆ సీన్స్ అన్నింటిని ఇప్పుడు ట్రిమ్ చేయాలని కియారా కోరిందంట.


ఏ సినిమాలో అయినా బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు హీరోహీరోయిన్ ని అడిగి వారు ఓకే అన్నాకే షూట్ చేస్తారు. కియారా అప్పుడు ఓకే అని.. ఇప్పుడు రివర్స్ అవ్వడానికి కారణం ఏంటి.. ? అంటే.. షూట్ చేసేటప్పుడు బాగానే ఉన్నా.. అవుట్ పుట్ లో చూసినప్పుడు కియారాకి ఇబ్బందిగా అనిపించాయని, అందుకే ట్రిమ్ చేయమని చెప్పినట్లు సమాచారం. అయితే ఒకసారి షూట్ అయ్యి, ఎడిటింగ్ కి వెళ్ళిపోయాక ఫైనల్ కట్ పై నియంత్రణ కేవలం డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కే ఉంటుంది. ఇప్పుడు కియారా సీన్స్ ని మేకర్స్ కట్ చేస్తారా.. ? లేదా.. ? అసలు ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - May 02 , 2026 | 03:30 PM