రవి మోహన్ చిత్రానికి.. కెనీషా సంగీతం
ABN , Publish Date - Sep 11 , 2026 | 09:49 AM
యోగిబాబు కథనాయకుడిగా ప్రముఖ హీరో రవి మోహన్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆన్ ఆర్డినరీ మ్యాన్.
ప్రముఖ కమెడియన్ యోగిబాబు (Yogi Babu) కథనాయకుడిగా ప్రముఖ హీరో రవి మోహన్ (Ravi Mohan) తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆన్ ఆర్డినరీ మ్యాన్ (An Ordinary Man). ఈ సినిమా ద్వారా జయం రవి ప్రేయసి, బెంగళూరుకు చెందిన ప్రముఖ సంగీత కళాకారిణి కెనీసా ఫ్రాన్సిస్ (Keneeshaa Francis) సంగీత దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.
ఈ విషయాన్ని రవి మోహన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'ఒక కొత్త సంగీతం అడవిలోకి ప్రవేశించింది. కొత్త అధ్యాయం, అదే ఆత్మ. మీకు తెలిసిన కళాకారిణి. మునుపెన్నడూ వినని కొత్తశైలిలో 'ఆన్ ఆర్డినరీ మ్యాన్' చిత్రంలో కొత్త సంగీతం. అద్భుతమైన పరిచయం. సినీ ప్రపంచం కెనీషాకు స్వాగతం పలుకుతోంది' అని ఆ పోస్టులో పేర్కొన్నారు. రవి మోహన్ స్టూడియోస్ పతా కంపై తెరకెక్కే ఈ చిత్రంలో యోగిబాబు హీరో.