కెన్‌ కరుణాస్‌.. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌ టు డైరెక్టర్‌..

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:32 PM

కెన్‌ కరుణాస్‌ మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. నటుడిగా, గాయకుడిగా, గేయ రచయితగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఓ సినిమాకు దర్శకుడిగా తెరపై పేరు చూసుకునే స్థాయికి ఎదిగారు

బాల నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఎందరో సినిమా ఇండస్ట్రీల్లో స్టార్‌లుగా ఎదిగారు. అందులో కొందరు హీరోలుగా మారితే.. మరికొందరు మెగాఫోన్‌ పట్టి దర్శకులయ్యారు. కెన్‌ కరుణాస్‌ (ken Karunas) కూడా అదే బాటలో వెళ్తున్నారు. తమిళంలో ప్రముఖ హాస్యనటుడైన కరుణాస్‌ కేవలం నటనకే పరిమితం కాకుండా కంపోజర్‌గా సింగర్‌గా కెరీర్‌ సాగించారు. ఇప్పుడు ఆయన కుమారుడు కెన్‌ కరుణాస్‌ కూడా తండ్రి స్ఫూర్తితో చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ‘రాగలైపురమ్‌’ చిత్రంతో బాలనటుడిగా కెరీర్‌ మొదటుపెట్టిన కెన్‌ తండ్రిలాగే మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌గా ఎదిగారు. నటనతోపాటు సంగీతం మీదు పట్టు సాధించారు. గాయకుడిగా, గేయ రచయితగా పలు చిత్రాలకు పని చేశారు. అయితే ఆయనలో ఉన్న మరో టాలెంట్‌ డైరెక్షన్‌. తమిళ అగ్ర నటుడు ధనుష్‌ నటించిన ‘అసురన్‌‘, ‘వాతి’, ‘తిరుచిత్రంబలం’, ‘రాయన్‌’ చిత్రాల్లో నటించడమే కాకుండా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పని చేశారు. కొన్ని సినిమాలు రాసి పాడారు కూడా. ఇప్పుడు మెగా ఫోన్‌ పట్టి దర్శకుడిగా మారారు. తమిళంలో యూత్‌ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అంతే కాదు ఈ చిత్రంలో హీరోగా కూడా నటించారు. హీరోగా, దర్శకుడిగా ఆయనకిది తొలి చిత్రం. ఈ సినిమాకు మూడు పాటలు కూడా రాశారు.

WhatsApp Image 2026-03-24 at 11.10.20 AM.jpeg

కమింగ్ ఆఫ్ ఏజ్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా ఈ నెల 19న విడుదలై చక్కని విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రం తెలుగులో కూడా రానుంది. ఈ నెల 26న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తమిళంలో ఈతరం యువతగా హీరోగా, దర్శకుడిగా ఫ్రూవ్‌ చేసుకున్నారు. తెలుగులోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు కెన్‌ కరుణాస్‌ కూడా అదే పనిలో ఉన్నారు. తమిళంలో హిట్టైన ‘యూత్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందుతుందని నమ్ముతున్నారు. 

Updated Date - Mar 24 , 2026 | 03:46 PM