సీఎం విజయ్ మా కాళ్ళ మీద పడ్డాడు.. అందుకే ఓటు వేశాం
ABN , Publish Date - May 15 , 2026 | 04:10 PM
దళపతి విజయ్ (Vijay) ప్రస్తుతం తమిళనాడు సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే. సీఎం గా పదవి చేపట్టిన వెంటనే స్కూల్స్ దగ్గర ఉన్న మందుషాపులను తీయించేసి ప్రజల మనస్సులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
దళపతి విజయ్ (Vijay) ప్రస్తుతం తమిళనాడు సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే. సీఎం గా పదవి చేపట్టిన వెంటనే స్కూల్స్ దగ్గర ఉన్న మందుషాపులను తీయించేసి ప్రజల మనస్సులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎంత మంచి చేసినా ఆయన రాజకీయ కెరీర్ లో మాయని మచ్చగా మారిన ఘటన కరూర్ తొక్కిసలాట. గత సెప్టెంబరులో కరూర్‌లో జరిగిన విజయ్ సభలో భారీగా అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ విషాద ఘటనలో 41 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ సంఘటన తమిళనాడులో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెల్సిందే.
కరూర్ ఘటనను ఆయుధంగా తీసుకొని విజయ్ ని ఎన్నికల్లో గెలవకుండా ప్రతిపక్ష పార్టీలు చాలా ప్రయత్నాలు చేశాయి. అయినా కూడా అవిజయ్ గెలుపును ఆపలేకపోయాయి. తాజాగా విజయ్ సీఎం అయ్యాక.. కరూర్ బాధిత కుటుంబాలను ఒక మీడియా సంస్థ కలిసి వారి రియాక్షన్ తెలుసుకుంది. బాధిత కుటుంబాలు.. విజయ్ గురించి చెప్పిన మాటలు విని తమిళనాడు ప్రజలు షాక్ అయ్యారు.
'కరూర్ ఘటన తరువాత విజయ్ మా ఇళ్ళకు వచ్చి కలిసి మమ్మల్ని పరామర్శించాడు. మాకు అండగా ఉంటామని తెలిపాడు. చెప్పినట్లే అండగా నిలిచాడు' అని బాధితుల తల్లిదండ్రులు తెలిపారు. ' నా కూతురు మరణించాక విజయ్ ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. క్షమించమని కోరాడు. మాకు ఎప్పుడు ఏది కావాలన్నా అండగా నిలబడతానని చెప్పాడు. ఆయనలో ఒక నిజాయితీ మేము చూశాం. ఒక మంచి మార్పు వస్తుందని నమ్మాము. అందుకే ఆయనకు ఓటు వేశాం. ఆ మార్పు వచ్చినరోజున మేము చాలా సంతోషిస్తాం' అని మరో బాధిత కుటుంబం తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.