Annagaru Vostaru: ఓటీటీకి వస్తున్న అన్నగారు..
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:05 PM
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi), కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నలన్ స్వామి (Nalan Swamy) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వా వాతియార్ (Vaa Vaathiyaar).
Annagaru Vostaru: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi), కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నలన్ స్వామి (Nalan Swamy) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వా వాతియార్ (Vaa Vaathiyaar). స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాను తెలుగులో అన్నగారు వస్తారు (Annagaru Vostaru) అనే పేరుతో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అన్ని బావుండి ఉంటే సంక్రాంతి బరిలో అన్నగారు కూడా సందడి చేసేవారు. కానీ, నిర్మాత ఫైనాన్షియల్ సమస్యల కారణంగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. చివరకు తమిళ్ లో జనవరి 14 న రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యింది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు అని చెప్పొచ్చు.
ఇక తమిళ్ లో పరాజయం అందుకోవడంతో.. తెలుగులో రిలీజ్ చేయడం ఎందుకు అనుకున్నారో ఏమో మేకర్స్.. ఏకంగా ఓటీటీ బాట పట్టారు. తమిళ్ రిలీజ్ అయ్యి రెండు వారాలు కూడా కాకముందే అన్నగారు ఓటీటీలోకి వచ్చేసారు. వా వాతియార్ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. జనవరి 28 నుంచి ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ అధికారికంగా తెలిపింది.
వా వాతియార్ కథ విషయానికొస్తే.. రాజ్ కిరణ్ కి MGR అంటే ఎంతో ఇష్టం. ఆయన మరణించిన రోజునే తనకు మనవడు పుట్టడంతో స్వయానా MGR నే తన ఇంట్లో పుట్టాడని నమ్మి అతనికి రామేశ్వర్ (కార్తీ) అని పేరు పెడతాడు. మనవడిలోనే తన అభిమాన హీరోని చూసుకుంటూ ఉంటాడు. ఇక తన హీరో నిజాయితీకి మారుపేరుగా ఉండడంతో మనవడిని పోలీస్ ని చేసి నిజాయితీగా ఉండమని చెప్తాడు. కానీ, తాత మాటను లెక్కచేయని రామేశ్వర్.. లంచాలు తీసుకుంటూ.. మాఫియాకు మద్దతుగా నిలుస్తాడు. అయితే ఒకానొక సమయంలో తాతకి మనవడి నిజస్వరూపం తెలియడంతో ఆయన మరణిస్తాడు. తాత మరణం రామేశ్వర్ ని మారుస్తుందా.. ? తాత కోరినట్లు రామేశ్వర్ నిజాయితీ గల పోలీస్ గా మారాడా.. ? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేని అన్నగారు ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.