సర్దార్ 2 ట్రైలర్.. కార్తీ నట విశ్వరూపం.. అదిరిపోయిదంతే

ABN , Publish Date - Aug 31 , 2026 | 09:13 PM

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి సర్దార్ 2. ప్రముఖ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ - కార్తీ కాంబోలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 రానుంది.

Sardar 2

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి సర్దార్ 2 (Sardar 2). ప్రముఖ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ - కార్తీ కాంబోలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 రానుంది. ఈ సినిమాలో కార్తీ ప్రత్యర్థిగా వర్సటైల్ నటుడు ఎస్.జె. సూర్య నటించగా, మాళవికా మోహనన్ కీలక పాత్రలో కనిపించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సర్దార్ చివర్లో బోస్ కొడుకు విజయ్ ప్రకాష్ కూడా స్పైగా మారినట్లు, ఆయనకు కొత్త మిషన్ ఇచ్చినట్లు చూపించారు.


అయితే ట్రైలర్ ని బట్టి.. సర్దార్ 2 లో కూడా బోస్ కొత్త మిషన్ కోసం జపాన్ వెళ్ళినట్లు చూపించారు. దేశానికి పొంచి ఉన్న ఒక పెద్ద ముప్పును నివారించేందుకు, జపనీస్ భాష తెలిసిన ఒక ప్రత్యేక బ్లాక్ ఆప్స్ ఏజెంట్‌ను రంగంలోకి దించడంతో ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమవుతుంది. కోట్లాది మంది ప్రాణాలను కాపాడేందుకు బోస్ చేపట్టే అత్యంత ప్రమాదకరమైన మిషన్, రైళ్లు, విమానాలు, శత్రువుల స్థావరాలలో జరిగే భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక బోస్ కి అండగా ఉండే అధికారి పాత్రలో మాళవిక మోహనన్ కనిపించింది. చివర్లో అసలు విలన్ సూర్య ఎంట్రీ ఇవ్వడం.. సర్దార్ కి తాను ఫ్యాన్ బాయ్ అని చెప్పడం.. ఇద్దరి మధ్య యుద్ధం అదిరిపోయింది. సర్దార్.. వన్స్ ఏ స్పై.. ఆల్ వేస్ ఏ స్పై అనే టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చినట్లు ట్రైలర్ కట్ చేసిన విధానం అదిరిపోయింది.


ఇక సినిమాకు సామ్ సి.ఎస్. అందించిన నేపధ్య సంగీతం, గ్రాండ్ విజువల్స్ ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. సర్దార్ లో కనిపించిన ప్రతి ఒక్కరూ.. సీక్వెల్ లో కూడా కనిపించారు. ఈసారి బోస్ ఫ్యామిలీని మరింత ఎక్కువగా చూపించారు. ఇక రెండో కార్తీకి జంటగా ఆషికా రంగనాథ్ కనిపించింది. మొత్తానికి సర్దార్ 2 లో కూడా తండ్రీకొడుకులు కలిసి చేసే మిషన్ కాకుండా.. కేవలం బోస్ చేసే మిషన్ చూపించి హైప్ పెంచేశారు. స్పై ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.మరి ఈ సినిమాతో కార్తీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Aug 31 , 2026 | 09:13 PM