Karthi: ‘సర్దార్‌ 2’.. రిలీజ్ డేట్ ఫిక్స్‌

ABN , Publish Date - Jun 25 , 2026 | 09:14 AM

కార్తి హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

Sardar

కార్తీ (Karthi) హీరోగా నాలుగేండ్ల క్రితం అనామ‌కంగా విడుద‌లై తెలుగు, తమిళ భాషల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం స‌ర్దార్ (Sardar). కాగా ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ స‌ర్దార్ 2 (Sardar 2) రూపుదిద్దుకున్న‌ విష‌యం తెలిసిందే. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పి.ఎస్‌.మిత్రన్ (PS Mithran) ఈ సినిమాకు దర్శకుడు. అయితే ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ స‌న్న‌ద్ద‌మ‌యింది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ సినిమా విడుద‌ల గురించి అప్డేట్ ఇచ్చారు.

ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 10న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించడంతో వారి నిరీక్షణ ఫలించినట్లయింది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌.జె. సూర్య (SJ Suryah) ఓ పవర్‌ఫుల్‌ పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎ.వెంకటేశ్‌, నిర్మాతలు: ఎస్‌.లక్ష్మణ్‌కుమార్‌, ఇషాన్‌ సక్సేనా.

Updated Date - Jun 25 , 2026 | 09:15 AM