రెమ్యునరేషన్.. పెంచేసిన రుక్మిణీ వసంత్
ABN , Publish Date - Mar 02 , 2026 | 07:41 AM
యువ హీరోయిన్ రుక్మిణి వసంత్ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న తరుణంలో ఆమె రెమ్యునరేషనను ఒక్కసారిగా పెంచేసినట్లు న్యూస్ వైరల్ అవుతోంది.
శాండల్ వుడ్ నుంచి దిగుమతయిన యువ హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న తరుణంలో ఆమె రెమ్యునరేషనను ఒక్కసారిగా పెంచేసినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. రెండేండ్ల క్రితం కన్నడ నుంచి వచ్చి విజయం సాధించిన సప్త సాగరాలు దాటి సినిమాతో ఈ బ్యూటీ అందరి దృష్టి ఆకర్షించింది.

ఆపై విజయ్ సేతుపతి నటించిన ఏస్ (Ace) చిత్రంతో తమిళంలో, నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo) సినిమాతో తెలుగు భాషల్లోనూ అడుగు పెట్టిన ఈ భామ అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను సొంత చేసుకుంది.

చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తు వెళుతున్న ఈ ముద్దుగుమ్మ గత సంవత్సరం శివ కార్తికేయన్ హీరోగా నటించిన మదరాసి (Madharaasi)తో అలరించింది. ఆ వెంటనే రిషబ్ షెట్టి కాంతార చాప్టర్-1 (Kantara: Chapter 1) లో పాత్రతో జాతీయ స్థాయిలో పేరుతో పాటు స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ (Toxic) మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక ఎన్టీర్-నీల్ (NTR Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం జూన్‌లో థియేటర్లకు రానుంది. ఇవిగాక తెలుగు, తమిళ భాషల్లో ఓ నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా వరుస అవకాశాలు వస్తుండడంతో రుక్మిణి తన రెమ్యు నరేషన్‌ను ఒక్కసారిగా రూ.5 కోట్లకు పెంచేసినట్టు సినీ వర్గాల సమాచారం.