అల్లు అరవింద్‌కు యష్ తల్లి గట్టి కౌంటర్..

ABN , Publish Date - Aug 30 , 2026 | 09:54 PM

కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారాడు యష్. ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ని అందుకుందో అందరికీ తెల్సిందే. ఇక కెజిఎఫ్ 2 తరువాత యష్ నుంచి సినిమా రావడానికి దాదాపు నాలుగేళ్ళు పట్టింది.

Yash

కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారాడు యష్(Yash) . ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ని అందుకుందో అందరికీ తెల్సిందే. ఇక కెజిఎఫ్ 2 తరువాత యష్ నుంచి సినిమా రావడానికి దాదాపు నాలుగేళ్ళు పట్టింది. కెజిఎఫ్ రేంజ్ లో ఉండే సినిమానే తెరకెక్కించాలని యష్ ఎంతో ఎదురుచూసీ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ కి ఓకే చెప్పాడు. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 26 న రిలీజ్ అయిన టాక్సిక్ మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా నెగిటివ్ ట్రోల్స్ బారిన పడింది. అసలు ఇదేమి సినిమా అని జనాలు అందరూ తిట్టడం మొదలుపెట్టారు.


కెజిఎఫ్ తో యష్ సంపాదించుకున్న పేరు మొత్తం టాక్సిక్ తో పోయిందని ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి తోడు గతంలో నిర్మాత అల్లు అరవింద్ కేజీఎఫ్ కంటే ముందు యష్ ఎవరు? అంటూ చేసిన వ్యాఖ్యలను కూడా కొందరు గుర్తుచేస్తున్నారు. ఇక తాజాగా ఈ ట్రోల్స్ పై యష్ తల్లి పుష్ప గట్టి కౌంటర్ ఇచ్చింది. యష్ ఏదో రోడ్డుపై వెళ్లే వ్యక్తి కాదు.. అతనొక స్టార్ హీరో అని ఘాటుగా సమాధానం చెప్పింది. సొంత కష్టంతో పైకి వచ్చి స్వయంకృషితో ఎదిగిన కొడుకును కన్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది.


తన కుమారుడి సినీ ప్రయాణం గురించి యష్ తల్లి మాట్లాడుతూ.. యష్ ఎలాంటి సినీ నేపథ్యం, డబ్బు లేదా ఇండస్ట్రీ అండ లేకుండా సొంత కష్టంతో ఈ స్థాయికి ఎదిగాడని, యష్ ఏదో రోడ్డుపై వెళ్లే వ్యక్తి కాదు.. కెజిఎఫ్ కంటే ముందే కర్ణాటకలో ఆయన వరుస హిట్లతో స్టార్ హీరోగా నిలిచాడని ఆమె చెప్పుకొచ్చింది. కెజిఎఫ్ కంటే ముందు యష్ ఎవరు? అని పదే పదే ప్రశ్నించే వారికి కన్నడ చిత్రసీమలో ఆయన సాధించిన విజయాలే ప్రత్యక్ష సాక్ష్యమని సవాల్ విసిరింది. ఎవరి పేర్లను ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, అల్లు అరవింద్‌తో పాటు యష్‌ను తక్కువ చేసి మాట్లాడే విమర్శకులకు ఆమె ఇన్ డైరెక్ట్ గా గట్టి కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు. సొంత కష్టంతో పైకి వచ్చి స్వయంకృషితో ఎదిగిన కొడుకును కన్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె తెలిపింది. యష్ తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - Aug 30 , 2026 | 09:54 PM