తబాహీ వీడియో.. యశ్- కియారా రొమాన్స్ పీక్స్
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:11 PM
కేజీఎఫ్ సిరీస్‌తో గ్లోబల్ రేంజ్‌లో సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్ (Yash) నాలుగేళ్ల గ్యాప్ తరువాత నటించిన చిత్రం టాక్సిక్ (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
కేజీఎఫ్ సిరీస్‌తో గ్లోబల్ రేంజ్‌లో సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్ (Yash) నాలుగేళ్ల గ్యాప్ తరువాత నటించిన చిత్రం టాక్సిక్ (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ (Kiara Advani), నయనతార, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఆ మధ్య విడుదల చేసిన తబాహీ ఆడియో సాంగ్ కూడా ప్రేక్షకులను మెప్పించింది.
తాజాగా మేకర్స్ తబాహీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా స్వయంగా కంపోజ్ చేసి తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించిన ఈ సాంగ్ కి స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఎంతో అద్బుతంగా తెలుగు లిరిక్స్ అందించారు. అయితే ఈ పాటలో అందరినీ అసూయపరుస్తున్న ప్రధానాకర్షణ.. రాకింగ్ స్టార్ యశ్, కియారా అద్వానీల మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్. పాటలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే కొన్ని రొమాంటిక్ అండ్ ఇంటెన్స్ షాట్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
యశ్ రగ్గడ్ అండ్ మాస్ లుక్‌కి, కియారా అద్వానీ క్లాసీ గ్లామర్ తోడవ్వడంతో స్క్రీన్ పై ఈ సరికొత్త జోడీ కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్‌లో పండింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ మూమెంట్స్ అండ్ ఐ-కాంటాక్ట్ షాట్స్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం 2026, ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో యశ్ తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం తబాహీ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ సినిమాతో యశ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.