టాక్సిక్.. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారంటే

ABN , Publish Date - Aug 10 , 2026 | 08:43 PM

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా, జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రం టాక్సిక్(Toxic).

Toxic

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా, జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రం టాక్సిక్(Toxic). కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, హుమా ఖురేషీ, తారా సుతారియా వంటి తారలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా రిలీజ్ కు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించింది. ఇక తాజాగా ఈ సినిమా పారితోషికాల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమాలోని నటీనటుల రెమ్యూనరేషన్లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి.


భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీగానే బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. హీరో యష్ ఈ సినిమా కోసం నేరుగా రూ. 50 కోట్ల పారితోషికం తీసుకోవడమే కాకుండా ఈ చిత్రానికి సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటంతో లాభాల్లో వాటాతో కలిపి యష్ మొత్తం పారితోషికం రూ. 100 కోట్ల మార్క్‌ను దాటనుంది. ఇక ఈ సినిమాలో కథానాయిక కాకపోయినప్పటికీ, అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్న నయనతార ఏకంగా రూ.18 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. మరోవైపు సినిమాలో నదియా పాత్రలో ప్రధాన కథానాయికగా నటిస్తున్న కియారా అద్వానీకి దాదాపు రూ.15 కోట్లు లభించినట్లు తెలుస్తోంది.


ఇక వీరితో పాటు సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణీ వసంత్ రూ. 3 కోట్లు అందుకోగా, ఎలిజిబెత్ పాత్రలో నటిస్తున్న హుమా ఖురేషీకి, రెబెకా పాత్ర పోషిస్తున్న తారా సుతారియాకు చెరో రూ. 2 కోట్ల వరకు అందించినట్లు తెలుస్తోంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.మరి ఈ సినిమాతో యష్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Updated Date - Aug 10 , 2026 | 08:44 PM