వీరప్పన్ కిడ్నాప్ చేసిన.. రాజ్ కుమార్ ఇంటిపై బాంబు దాడి? అసలేం జరిగిందంటే?

ABN , Publish Date - Nov 11 , 2026 | 10:27 AM

కన్నడ నటుడు రాజ్ కుమార్ పూర్వీకుల ఇల్లు బాంబు పేలుడులో ధ్వంసమైందంటూ వైరల్ అయిన వార్తలపై తాళవాడి పోలీసులు స్పందించారు. అసలు ఏం జరిగిందో వెల్లడించారు.

dr rajkumar

తమిళనాడులోని (Tamilnadu) ఈరోడ్ జిల్లా తాళవాడి కొండప్రాంతమైన తొట్టగజనూరు గ్రామంలో ప్రముఖ కన్నడ నటుడు రాజ్ కుమార్ (Dr Rajkumar) పూర్వీకుల ఇల్లు సోమవారం బాంబు పేలిన ఘటనలో స్వల్పంగా ధ్వంసమైనట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరలైంది.

రాజ్ కుమార్ బంధువుల్లో ఒకరైన మనోరాజ్ తన కుటుంబంతో తొట్టగజనూరు గ్రామంలో నివశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బాంబు పేలుడు ఘటనలో ఆ ఇల్లు స్వల్పంగా ధ్వంసమైనట్లు కర్ణాటక మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ జరగలేదని తాళవాడి పోలీసులు తెలిపారు.

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో నటుడు రాజ్ కుమార్ పూర్వీకుల ఇల్లు బాంబు పేలిన ఘటనలో ధ్వంసమైనట్లు సోషల్ మీడియాలో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్నారు. కాగా, 2000, జూలై 30వ తేదీ ఈ ఇంట్లోనే రాజ్ కుమార్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ (Veerappan) కిడ్నాప్ చేసి 108 రోజుల బంధీగా ఉంచడం గమనార్హం.

Updated Date - Nov 11 , 2026 | 10:59 AM