వారం రోజులు.. కన్నడ సినిమాలే న‌డ‌వాలి! ఉల్లంఘిస్తే.. థియేటర్ల లైసెన్స్ రద్దు

ABN , Publish Date - Oct 30 , 2026 | 06:38 AM

కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కర్ణాటకలోని బళ్లారి జిల్లా యంత్రాంగం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Ballari Theatres

కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కర్ణాటకలోని బళ్లారి జిల్లా యంత్రాంగం కీలక ఆదేశాలు జారీ చేసింది. కన్నడ రాజ్యోత్సవం (Kannada Rajyotsava) లో బాగంగా బళ్లారి (Ballari) జిల్లాలోని అన్ని సినిమాహాళ్లలో నవంబర్ 1నుంచి 7 వరకు కన్నడ చిత్రాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని డిప్యూటీ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్ (K. Nagendraprasad, IAS) ఒక ప్రకటనలో సూచించారు.

జిల్లాలోని అన్ని శాశ్వత, పాక్షిక, తాత్కాలిక సినిమా హాళ్లు, వీడియో థియేటర్లలో కన్నడ చిత్రాలను మాత్రమే ప్రదర్శించాలన్నారు. దీనిని ఉల్లంఘిస్తే థియేటర్ల లైసెన్సు పునరుద్ధరించబోమ‌న్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అక్టోబరు 31, నవంబరు 1తేదీలలో థియేటర్ యజమానులు తమ థియేటర్లను తప్పనిసరిగా అలంకరించాలని ఆయన ఆదేశించారు.

Updated Date - Oct 30 , 2026 | 01:47 PM