ప్రముఖ దర్శకుడు.. NS శంకర్ మృతి
ABN , Publish Date - Jun 29 , 2026 | 06:40 AM
కన్నడ సినిమా 'ఉల్టా పల్టా' ద్వారా దర్శకుడిగా గుర్తింపు పొందిన ఎన్ఎస్ శంకర్ (67) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు.
సుదీర్ఘకాలం పాత్రికేయుడిగా కొనసాగి 1997లో కన్నడ సినిమా 'ఉల్టా పల్టా' ద్వారా దర్శకుడిగా గుర్తింపు పొందిన ఎన్ఎస్ శంకర్ (67) (NS SHANKER) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. ఆయన పలు సినిమాల్లోణ/ నటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ ఆదివారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే గుండెపోటు రావడంతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ కన్నడ పత్రికలైన ప్రజావాణి, లంకేశ్‌లలో పనిచేసిన శంకర్ రచయిత గానూ గుర్తింపు పొందారు. కన్నడ, దళిత సాహిత్య రంగం ద్వారా అనేక ప్రశంసనీయమైన రచనలు అందించారు. 2024లో రాజ్యోత్సవ పురస్కారం అందుకున్నారు. శంకర్ మృతి పట్ల సీఎం డీకే శివకుమార్, కేంద్రమంత్రి కుమారస్వామి, మాజీ సీఎం సిద్దరామయ్య సహా పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివానంద తగడూరు సహా పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.