బాత్ రూంలో.. న‌టి వీడియో చిత్రీక‌ర‌ణ‌! బెదిరింపులు

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:59 PM

బెంగళూరులో జరిగిన ఓ ఇండోర్ ఈవెంట్‌కు హాజరైన 32 ఏళ్ల కన్నడ నటికి భయానక అనుభవం ఎదురైంది.

secret camera

బెంగళూరులో జరిగిన ఓ ఇండోర్ ఈవెంట్‌కు హాజరైన 32 ఏళ్ల కన్నడ నటి భయానక అనుభవం ఎదురైంది. ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా కొందరు దుర్మార్గులు ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 7న ఓ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లిన ఆమె, అక్కడ ఉన్న మహిళల ఉమెన్స్ రెస్ట్‌రూమ్‌ను ఉపయోగించారు.

అయితే.. అదే సమయంలో గుర్తు తెలియని కొంద‌రు వ్యక్తులు ఆ రూమ్‌లో రహస్య కెమెరా అమర్చి వీడియో చిత్రీకరించారు. ఆ తరువాత అదే వీడియోను ఆయుధంగా చేసుకుని ఆమెను బెదిరింపులకు గురిచేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా న‌టిని కాంటాక్ట్ అయి డబ్బులు డిమాండ్ చేసిన దుండగులు, కోరిన మొత్తం చెల్లించకపోతే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని హెచ్చరించారు.

ఈ బ్లాక్‌మెయిల్ రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో నటి చివరకు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఉపయోగించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఆధారంగా వారి వివరాలు సేకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఘటనపై క‌న్న‌డ టీవీ, సినీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Feb 17 , 2026 | 08:40 PM