దర్శన్‌కు భారీ షాక్.. రేణుకాస్వామి హత్య కేసులో ముగ్గురు అప్రూవర్లు, కేసులో బిగ్ ట్విస్ట్!
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:38 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చిత్రదుర్గ రేణుకాస్వామి (Renukaswamy) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏకంగా ముగ్గురు ఆరోపితులు అప్రూవర్‌గా మారారు. దీంతో కేసును ఎదుర్కొంటున్న 13వ నిందితుడు ప్రదూష్ రావ్ (Pradosh Rao) అప్రూవర్ గా మారుతున్నట్లు సీసీహెచ్-59 కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఇదే కేసులో ఉండే రవిశంకర్, వినయ్ కూడా అప్రూవర్‌గా మారుతున్నట్లు వారి తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రదూష్ తరుపు న్యాయవాది దివాకర్ గురువారం కోర్టులో వాదనలు వినిపించారు. తమ కక్షిదారుడు అప్రూవర్‌గా మారి కోర్టు ముందు వాస్తవాలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని కోర్టు క్షమాబిక్షకు అనుమతించాలని వాదించారు.
జైలులో ఇదే కేసును ఎదుర్కొంటున్న పలువురితో కలసి ఒకే సెల్‌లో ఉన్నారని ప్రధూషను మరో బ్యారెక్‌కు మార్పు చేయాలని విన్నవించారు. ఆరోపితులు రవిశంకర్, వినయ్స్ తరుపున వాదనలు వినిపించిన న్యాయవాదులు మా కక్షిదారులు కూడా అప్రూవర్‌గా మారుతున్నట్లు వాదించారు. ఇందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ఇదే సందర్భంలోనే ప్రధూష్రవ్ తరుపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముందుగా తాము పిటిషన్ దాఖలు చేశామని కానీ వారు ఇంకా పిటీషన్ దాఖలు చేయలేదని వాదించారు. ముందుగా మా పిటీషన్‌ను పరిగణించాలని కోరారు. సాధ్యమైంత త్వరగా విచారణలు జరిపే అవకాశం కల్పించాలని కోరారు. ప్రాసిక్యూషన్ తరుపున వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసి క్యూటర్ ప్రసన్నకుమార్ తొలుత దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణలు జరపాలన్నారు. అతడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వెసలుబాటు కల్పించాలన్నారు ఇతర ఆరోపితులు వ్యతిరేకతకు అవకాశం లేదన్నారు.
అప్రూవర్‌గా మారిన నిందితులు సీఆర్పీన్ 306 సెక్షన్‌ను పాటించాలన్నారు. ఒకే సారి ముగ్గురు సహ ఆరోపితులు అప్రూవర్‌గా మారేందుకు సిద్ధం కావడంతో పరప్పన అగ్రహార జైలులో ప్రత్యేక బందోబస్తుకు సిద్ధమయ్యారు. తోటి ఖైదీలు ఉండే బ్యారెక్ల నుంచి మరో చోటుకు మార్పుకు సిద్ధమయ్యారు. ఇది నటుడు దర్శన్ (Darshan) తో పాటు పవిత్రాగౌడ (Pavithra Gowda) కు కోలుకోలేని దెబ్బగా మారింది.