Kamalhasan: చిరు, ఎన్టీఆర్ బాటలో.. కమల్‌హాసన్
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:04 AM
న్నైకి చెందిన ఓ సంస్థ తన చిత్రం, పేరు, ‘ఉలగనాయకన్’ చిత్రంలోని మాటలు వినియోగించి వివిధ వస్తువులు వినియోగిస్తోందంటూ కమల్‌హాసన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
నటుడు కమల్‌హాసన్ (Kamalhasan) పేరు, చిత్రాలను ఆయన అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వినియోగించరాదని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. చెన్నైకి చెందిన ఓ సంస్థ తన చిత్రం, పేరు, ‘ఉలగనాయకన్’ చిత్రంలోని మాటలు వినియోగించి వివిధ వస్తువులు వినియోగిస్తోందంటూ కమల్‌హాసన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామమూర్తి.. అనుమతులు లేకుండా వాణిజ్య రీత్యా కమల్ ఫొటో, పేరును వినియోగించరాదని ఆదేశించారు. అదే సమయంలో, కార్టూన్లలో కమల్ హాసన్ చిత్రాలు ఉపయోగించేందుకు ఎలాంటి నిషేధం లేదని తెలిపారు.
అలాగే, అనుమతి లేకుండా ఇతరులు తన ఫొటో, పేరు ఉపయోగించకూడదనే కోర్టు ఆదేశాలకు సంబంధించి తమిళ, ఆంగ్ల వార్తాపత్రికల్లో ప్రకటన ప్రచురించాలని కమల్‌కు సూచించారు.
అయితే.. గతంలో నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌లు సైతం కోర్టు ఆశ్రయించి తమ పేర్లను దుర్వినియోగం చేయకుండా చూసేలా ప్రత్యేక అనుమతులు తెచ్చుకున్నారు.