గేయ ర‌చ‌యిత‌.. వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం

ABN , Publish Date - Mar 15 , 2026 | 07:18 AM

ప్రముఖ తమిళ సాహితీవేత్త, సినీ పాటల రచయిత, కవి వైరముత్తు రామస్వామికి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది.

Vairamuthu

ప్రముఖ తమిళ సాహితీవేత్త, సినీ పాటల రచయిత, కవి వైరముత్తు రామస్వామి (Vairamuthu Ramasamy) కి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ (Jnanpith Award) పురస్కారం లభించింది. అంతకుముందు 1975. 2002లో ఇద్దరు తమిళ సాహితీవేత్తలను ఈ అవార్డులు వరించాయి. 23 ఏళ్ల తర్వాత ఈ పురస్కారాన్ని 73 ఏళ్ల వైరముత్తు అందుకో నున్నారు. తమిళ సాహిత్యానికి ఎనలేని సేవలు చేసి తన సృజనాత్మకతతో మెప్పించిన ఈయనకు 2025 సంవత్స రానికి 60వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ప్రదానం చేయాలని శనివారం ఢిల్లీలో ప్రముఖ ఒడియా రచయిత్రి ప్రతిభా రే అధ్యక్షతన జరిగిన సమా వేశంలో న్యాయనిర్ణేతల బృందం నిర్ణయించింది.

ప్రముఖ సాహితీవేత్తలు మాధవ్ కౌశిక్, దామోదర్ మోజో, ప్రపుల్ షిలేదార్, కేశుభాయి దేశాయి, కె. శ్రీనివాసరావు, జానకీ ప్రసాద్ శర్మ, ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ. కృష్ణారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ పురస్కారంలో భాగంగా వైరముత్తుకు రూ.11 లక్షల నగదు, జ్ఞాపికను బహూకరిస్తారు. ఈ సమావేశంలో రచయితలు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (తెలుగు), మహేశ్ ఎల్కుంచ్ వార్ (మరాఠీ), ప్రభావర్మ (మలయాళం) పేర్లపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి.

కవితా సంకలనాలు, నవలలతో పాటు 37 గ్రంథాలు, దాదాపు 7,500 సినీ గేయాలు రచించిన వైరము త్తుకు పద్మభూషణ్, పద్మశ్రీ, సాహిత్య ఆకాడమీ పురస్కారాలతోపాటు ఏడు సార్లు ఉత్తమ పాటల రచయితగా జాతీయ చలన చిత్ర పురస్కా ఆరుసార్లు తమిళనాడు ప్రభుత్వ ఆవార్డులు లభించాయి. 1991లో వచ్చిన సూపర్ హిట్ తమిళ సినిమా రోజాలో చిన్ని చిన్ని ఆనై పేరుతో బహుళ జనాదరణ పొందిన పాట రచయిత ఈయనే. ఈ సినిమా తర్వాత తెలుగులో డబ్ అయిన విషయం తెలిసిందే. రాలు,

దశాబ్దాల కృషికి సమున్నత సత్కారం

భారతీయ సాహిత్యంలో నోబుల్ బహుమతిగా పిలువబడే జ్ఞానపీఠ్ అవార్డును అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని ప్రముఖ తమిళ కవి, సినీ గేయ రచయిత వైరముత్తు అన్నారు. 1953 జూలై 13న తమిళనాడులోని తేని జిల్లా వడకపట్టిలో రామసామి, అంకమ్మాళ్ దంపతులకు ఆయన జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన వైరముత్తు పిన్న వయస్సులోనే అన్నాదురై, పెరియార్ సిద్దాంతాల పట్ల, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తమిళ సాహితీ రచనలపై మోజు పెంచుకున్నారు. కనీసం మంచినీటి సదుపాయం కూడా లేని తన గ్రామం.. పరిసర ప్రాంతాలను చూసి 12 యేళ్ల ప్రాయంలోనే కవితల‌ను రచించారు. చెన్నైలోని పచ్చయప్పన్ కళాశాలలో తమిళ సాహిత్యంలో డిగ్రీ కోర్సు చదివారు.

1980లో భారతిరాజా దర్శకత్వంలో 'నిళల్గల్' తమిళ సినిమాలో 'ఇదు ఒర్ పొన్ మాలై పొళుదు' అనే పాటను రచించి సినీ గేయ రచయితగా తమిళ చిత్రసీమలో ప్రవేశించారు. సుమారు 7 వేలకు పైగా సినిమా పాటలు రచించారు. 1981లో 'అలైగళ్ ఓయవదిల్లై' (తెలుగులో సీతాకోక చిలుక), 1995లో 'కరుత్తమ్మ', 1996లో 'ముత్తు, 'బొంబాయ్, 2000లో 'సంగమం', 2006లో 'అన్నియన్' (ఆపరిచితుడు) సినిమాలలో పాటలకు గాను తమిళనాడు ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. 1986లో తమిళనాడు ప్రభుత్వం ఆయనను 'కలైమామణి' అవార్డుతో సత్కరించింది. 2003లో కేంద్ర ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ' బిరుదును అందుకున్నారు.

ఇక 1986 నుండి 2011 వరకు 'ముదల్ మరియాదై', 'రోజా, 'కరుతమ్మా', 'పవిత్ర' 'సంగమం', 'కన్నత్తిల్ ముత్తమిట్టాల్', "తెన్ మేర్కు పరువకాట్రు' చిత్రాలలో శ్రావమైన పాటలు రచించినందుకు గాను ఆరు సార్లు ఉత్తమ గేయ రచయితగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు పొందారు. 2003లో 'కళ్ళికాట్టు ఇతిహాసం' రచనకు గాను ఆయనకు సాహిత్య అకాడమీ లభించింది. తమిళనాడు ఓపెన్ యూనివర్శిటీ, మదురై కామరాజర్ విశ్వ విద్యాలయం, కోయంబత్తూరులోని భారతియార్ విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌థో సత్కరించాయి. వైరముత్తు రచనలు ఆంగ్లం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, రష్యన్ భాషల్లోకి అనువదించబడ్డాయి.

మాజీ ప్రధాని వాజ‌పేయి వైరముత్తును 'కవి సామ్రాట్ అనే పిలిచేవారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వైరముత్తును 'కవిప్పేరరసు' అనే బిరుదుతో సత్కరించారు. ఆ పదమే వైరముత్తు ఇంటి పేరులా తమిళనాట మారు మోగుతుండటం విశేషం. వైరముత్తు సతీమణి పొన్మణి కూడా కవయిత్రిగా ఉన్నారు. ఈ దంపతులకు మదన్ గార్లీ, కపిలన్ అనే ఇద్దరు కుమారులు. వీరిలో మదన్గార్గ్ సినీ గేయరచయితగా ఉన్నారు. అయితే.. వైరముత్తు జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికకావటం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి, తనకు వైరముత్తు ప్రియమిత్రుడిగా ఉన్నారని తెలిపారు. ఇదే విధంగా పలువురు నేతలు కూడా: వైరముత్తుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - Mar 15 , 2026 | 10:03 AM