జన నాయగన్: ఎడిటింగ్ దశ నుంచే లీక్..
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:19 PM
తమిళ స్టార్ విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా ఆన్‌లైన్‌లో క్వాలిటీ ప్రింట్ లీక్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళ స్టార్ విజయ్ నటించిన 'జన నాయగన్' (jananayagan leak) సినిమా ఆన్‌లైన్‌లో క్వాలిటీ ప్రింట్ లీక్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో చిత్ర బృందం మాత్రమే కాకుండా ఇండస్ట్రీనే షాక్‌కు గురి చేసింది. నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురు ప్రధాన నిందితులను పట్టుకున్నట్లు తెలిసింది. ఎడిటింగ్ దశ నుంచే ఈ సినిమా లీక్ అయినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ టైంలోనే మూవీ లీక్ చేశారనే ప్రచారం సాగుతోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఫుటేజీలో వాటర్ మార్క్ ద్వారా ఈ లీక్ అక్కడి నుంచే జరిగినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా.. వారే లింక్స్ షేర్ చేయడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.