Jockey: విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన 'జాకీ' టీజర్
ABN , Publish Date - Jan 04 , 2026 | 07:04 PM
మధురై గ్రామీణ నేపథ్యంలో సంప్రదాయ క్రీడలపై తెరకెక్కిన సినిమా 'జాకీ'. అమ్ము అభిరామి కీలక పాత్ర పోషించిన ఈ సినిమా టీజర్ ను విజయ్ సేతుపతి విడుదల చేశారు.
మధురై గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా 'జాకీ' (Jockey). ఇందులో పొట్టేల్ పోరాటం హైలైట్ గా నిలువబోతోంది. చెన్నయ్ లో జరిగిన 13వ వీధి తిరువిళా కార్యక్రమంలో 'జాకీ' టీజర్ ను విడుదల చేశారు. 2021లో వచ్చిన 'మడ్డి' సినిమా తర్వాత పి. కె.7 స్టూడియోస్ దర్శకుడు డాక్టర్ ప్రగభల్ (Dr. Pragabhal) కలిసి తెరకెక్కించిన సినిమా ఇది. ప్రేమ కృష్ణదాస్, సి. దేవాదస్, జయ దేవదాస్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు.
ఇందులో యువన్ కృష్ణ (Yuvan Krishna), రిదాన్ కృష్ణాస్ (Ridhaan Krishnas), అమ్ము అభిరామి (Ammu Abhirami) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శక్తి బాలాజీ సంగీతం అందిస్తున్నారు. మధురైలో ఘనంగా జరిగే సంప్రదాయ పొట్టేలు పోరాటం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఇందులో పోరాట సన్నివేశాలను అత్యంత సహజంగా తెరకెక్కించడం కోసం మూడు సంవత్సరాల పాటు సినిమా బృందం కృషి చేసిందని, నేటివిటీని మిస్ కాకుండా సన్నివేశాలను చిత్రీకరించించామని దర్శక నిర్మాతలు తెలిపారు. నటీనటులు సైతం శిక్షణ తీసుకుని పొట్టేలుతో నటించారని అన్నారు. గ్రామీణ జీవితం, ప్రజల భావోద్వేగాలు, సంప్రదాయ క్రీడలకు ఇందులో ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. టీజర్ విడుదలతో తమ సినిమా ప్రయాణం విడుదలైందని, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సోషల్ మీడియా ద్వారా తమ టీజర్ ను విడుదల చేయడం ఆనందాన్ని కలిగించిందని వారు చెప్పారు.