సీఎం విజయ్, సంగీత సయోధ్య కష్టమేనా! అసలేం జరుగుతోంది?
ABN , Publish Date - Oct 05 , 2026 | 07:18 AM
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం ఇంకా తేలలేదా? ఇద్దరూ ఇక కలిసేది లేదా ? అసలేం జరిగింది ? చెన్నైలో జరుగుతోన్న ప్రచారం ఏంటి ?
హీరోగా ఉన్నప్పుడు విజయ్ (vijay)-సంగీత (sangeetha) ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు-కుమారుడు- జేసన్ సంజయ్ (jason sanjay), కుమార్తె- దివ్యా సాషా. అయితే తమిళనాట తిరుగులేని హీరోగా ఇమేజ్ సాధించిన తర్వాత విజయ్ వైవాహిక బంధానికి బీటలు వారాయి.. విజయ్‌కు మరో మహిళతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ సంగీత దూరమైంది. లండన్‌కు మకాం మార్చింది. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. పిల్లలు కూడా ఇల్లును వదిలి హాస్టల్స్‌లో చేరారు. ఆ తర్వాత విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి వెనువెంటనే ముఖ్యమంత్రి కావడం కూడా అయిపోయింది.
విజయ్ ప్రమాణస్వీకారానికి త్రిష హాజరుకావడంతో వ్యక్తిగత జీవితంపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. దీనితో ముఖ్యమంత్రిగా విజయ్ ఎంత బిజీగా ఉన్నా ఆయన వ్యక్తిగత జీవితంపై ఎవరో ఒకరు ఏదో రూపంలో ఆరోపణలు చేస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరి విడాకుల కేసు కోర్టుకు చేరుకుంది. సీఎం కాకముందు మొదలైన కేసు.. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక కోర్టుకు చేరింది.. దీనితో సంగీత కోర్టులో విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్నారు.
ఈ పరిణామంతో విజయ్-సంగీత ఒక్కటవుతారని అందరూ అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. భరణం కింద 300 కోట్లు సంగీత అడిగారని,విజయ్ దీనిని వ్యతిరేకించారనే ప్రచారమూ జరిగింది. ఈ పరిణామాల మధ్య కొన్ని కార్యక్రమాలకు త్రిష హాజరుకావడం సాధారణమైపోయింది.
ఈ పరిణామాలన్నిటి మధ్య కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన సిగ్మా (sigma) సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు సంగీత లండన్ నుంచి వచ్చి చెన్నైలో ప్రత్యక్షమయ్యారు. అయితే సంగీత ఇలా ప్రత్యక్షమవుతారని ఎవరూ ఊహించలేదు. థియేటర్ దగ్గర సంగీత ప్రత్యక్షమయ్యే సరికి విజయ్ అభిమానులు కూడా సంబరపడ్డారు. ఇద్దరూ కలుస్తారని భావించారు. సరిగ్గా కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె సాషాతో సంగీత సినిమా చూసిన సమయానికి, ముఖ్యమంత్రి హోదాలో విజయ్ బయట పలు కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. బస్సులో కండక్టర్ అవతారమెత్తారు. బయట సాధారణ ప్రజలతో కూర్చుని టీ తాగారు. కబుర్లు చెప్పారు.
అయితే వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిందని కొందరు, కుదరబోతోందని మరికొందరు అన్నీ చక్కబెట్టేందుకే సంగీత వచ్చారని ఇంకొందరు భావించారు. కానీ అవేమీ జరగలేదు.. ఆ రోజు తర్వాత అటు విజయ్ నుంచికాని, ఇటు సంగీత నుంచి కానీ ఎలాంటి ప్రకటనా రాలేదు.. దీనితో ఇద్దరి మధ్య ఇక సయోధ్య కష్టమేనని, కోర్టు వెలుపల ఒప్పందమే మిగిలిందని కమాన్ గుసగుస అంటూ చెన్నై గుప్పుమంటోంది.