రవి మోహన్: ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే చెన్నై వదిలేస్తునారా?
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:43 PM
కోలీవుడ్ ప్రముఖ హీరో రవి మోహన్ (Ravi mohan) గోవాకు మకాం మార్చనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకునేందుకు ఆయన కోర్టును ఆశ్రయించారు.
కోలీవుడ్ ప్రముఖ హీరో రవి మోహన్ (Ravi mohan) గోవాకు మకాం మార్చనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకునేందుకు ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ప్రస్తుతం న్యాయ విచారణలో ఉంది. అదే సమయంలో ఆయన ప్రస్తుతం బెంగుళూరు గాయని కెనిషాతో (Kenisha) సన్నిహితంగా ఉంటున్నారు. మరోవైపు సొంతంగా సినీ నిర్మాణ స్టూడియో నెలకొల్పి, ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదిలావుంటే,చెన్నైలో జరిగే పలు ఈవెంట్స్‌కు ఆయన గాయని కెనిషాతో కలిసి హాజరవుతున్నారు. దీంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. భార్యను బాధపెట్టి.. గాయనితో సన్నిహితంగా తిరగడం భావ్యమేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన మకాంను చెన్నై నుంచి గోవాకు మార్చాలని నిర్ణయం తీసుకుని, అక్కడ ఇల్లు కొనుగోలు చేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం రవి మోహన్‌కు కోడంబాక్కంలో తన తల్లిదండ్రులుంటున్న ఇల్లు, అడయార్ గేట్ సమీపంలో ఒక ఇల్లు, ఈసీఆర్ రోడ్డులో ఓ గృహం ఉంది. అయినప్పటికీ ఆయన చెన్నైలో కాకుండా, ఇతర రాష్ట్రంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒక వేళ రవి మోహన్ నిజంగానే తన మకాంను చెన్నై నుంచి గోవాకు మారిస్తే మాత్రం అందులో ప్రధాన పాత్ర మాత్రం కెనీషాకే ఉంటుందన్నడి కోడంబాక్కం వర్గాల సమాచారం.