పాపం విజయ్! ఇటు విడాకుల తీర్పు.. అటు త్రిష బర్త్ డే రోజే ఓట్ల లెక్కింపు
ABN , Publish Date - Mar 16 , 2026 | 08:09 PM
కొన్ని సంఘటనలు హఠాత్తుగా జరిగినప్పుడు అవి కేవలం యాదృచ్ఛికమా లేక ఎవరైనా ప్లాన్ చేసినట్లా? అనే సందేహం కలగడం సహజం.
కొన్ని సంఘటనలు హఠాత్తుగా జరిగినప్పుడు అవి కేవలం యాదృచ్ఛికమా లేక ఎవరైనా ప్లాన్ చేసినట్లా? అనే సందేహం కలగడం సహజం. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ (thalapathy vijay) వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రయాణానికి సంబంధించిన కొన్ని కీలక తేదీలు నెటిజన్లలో ఇటువంటి చర్చకే దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఆయన విడాకుల కేసు విచారణ, తమిళనాడు ఎన్నికలు, ఓట్ల లెక్కింపు రోజుతో పాటు నటి త్రిష (Trisha) పుట్టినరోజు వంటి కీలకమైన తేదీలు దగ్గరగా రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ తేదీల మధ్య ఉన్న వింత పోలికలే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలకు ప్రధాన కారణమవుతున్నాయి.
విజయ్, ఆయన భార్య సంగీత (Sangeetha) మధ్య విడాకుల కేసు విచారణ ఏప్రిల్ 20న జరగనుందని తెలుస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వినవస్తున్నా, అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. సరిగ్గా ఇదే సమయంలో ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతుండటంతో ఈ సమయం ఆయన కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది. వ్యక్తిగత సమస్యలు, రాజకీయ సవాళ్లు ఒకేసారి ఎదురవ్వడం గమనార్హం.
మరోవైపు, నటి త్రిష కృష్ణన్‌తో విజయ్ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో ఒక రేంజ్ లో వినిపిస్తున్నాయి. వీరిద్దరూ గతంలో కలిసి నటించిన సినిమాల ద్వారా ఏర్పడిన అనుబంధం, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు, వీడియోల వల్ల మరింత బలపడింది. కొన్ని సందర్భాల్లో వీరు జంటగా కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, వీరి మధ్య సంబంధం ఉందనే ప్రచారానికి ఆజ్యం పోసింది. ఈ రూమర్లు ఒక పక్కన కొనసాగుతుండగానే, రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది.
ఇక్కడ అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తమిళనాడు ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. అదే రోజు త్రిష కృష్ణన్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఈ యాదృచ్ఛికాన్ని చూసి కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఈ టైమింగ్‌పై ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై విజయ్ గానీ, త్రిష గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం ఊహాగానాలు గానే ఉన్నప్పటికీ, విజయ్ వ్యక్తిగత జీవితం, రాజకీయాలు, డేటింగ్ రూమర్లు అన్నీ ఒకేసారి చర్చకు రావడం సంచలనంగా మారింది.