కంపోజింగ్‌లో.. వయొలిన్, ఫ్లూట్ బదులు సరంగి ఉపయోగించాం
ABN , Publish Date - Apr 01 , 2026 | 07:56 AM
‘కార్మేని సెల్వం’ హృదయానికి హత్తుకునే సినిమా. మన జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది’ అని అన్నారు రామానుజన్.
‘కార్మేని సెల్వం’ హృదయానికి హత్తుకునే సినిమా. మన జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది’ అని అన్నారు రామానుజన్. సముద్రఖని (Samuthirakani), గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియ (Lakshmi Priyaa), అభినయ (Abhinaya) ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. రామ్ చక్రి (Ram Chakri) దర్శకత్వం వహించారు. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు (Arun Rangarajulu) నిర్మించారు.
ఈ సినిమా ఈ నెల 3న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీతం అందించిన రామానుజన్ ( Ramanujan MK) మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.‘ఒక చిత్రానికి సంగీతం అందించిన ఘనత ఏ ఒక్క వ్యక్తికీ కాకుండా, సదరు సంస్థకే దక్కాలని కోరుకున్నాం. అందుకే 2017లో బెంగళూరులో ‘మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ’ని ప్రారంభించాను.
‘కార్మేని సెల్వం’ సినిమాకు సంగీత దర్శకుడిగా నా పేరు బదులు.. మా సంస్థ పేరునే ప్రకటించాం. తండ్రీ-కొడుకుల మధ్య బంధాన్ని చూపించే సందర్భంలో ఈ పాట ఉంటుంది. కంపోజింగ్‌లో వైలిన్, ఫ్లూట్ బదులు సరంగి ఉపయోగించాలనే ఆలోచన వచ్చింది. అది భావోద్వేగాన్ని మరింత బలంగా చూపించింది’ అని రామానుజన్ అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా న్నే వదిలెల్లినావా అంట సాగే ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రాంబాబు గోసాల (Rambabu Gosala) సాహిత్యం అందించగా శ్రేయ శ్రీరంగ (Shreya Sriranga) ఆలపించింది.