Legend Saravanan: కాలం అనుకూలిస్తే.. త్వ‌ర‌లోనే రాజకీయాల్లోకి వస్తా

ABN , Publish Date - May 08 , 2026 | 11:36 AM

కాలం కలిసి వస్తే భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ వస్త్ర వ్యాపారి, సినీ నటుడు లెజెండ్ శరవణన్ పేర్కొన్నారు.

Legend Saravanan

కాలం కలిసి వస్తే భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ వస్త్ర వ్యాపారి, సినీ నటుడు లెజెండ్ శరవణన్ (Legend Saravanan) పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ జరిగిన వ్యాపారుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవ‌ల ముగిసిన ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే పార్టీ (Tvk) అవినీతి రహిత పాలన అందించాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రజలపై పన్నుల భారం మోప రాదని, అనవసరమైన ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకుని, అన్ని వర్గాల ప్రజలకు ఒక సంతోషకరమైన జీవితాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు మార్చు కోరుకున్నారన్నారు. కోళ త్తూరులో స్టాలిన్ (Stalin) ఓడిపోవడం సాధారణంగా ప్రతి రాజకీయ నేతకు ఎదురయ్యే సంఘటనేనని, రాజకీయాల్లో జయాపజయాలు సర్వసాధార ణమన్నారు. ఈ తరహా ఓటమి ప్రజల్లో విప్లవం వచ్చినప్పుడే ఎదురవు తుంద‌న్నారు.

గతంలో కూడా ఈ తరహా గెలుపోటములు పాతతరం నేతలకు ఎదురైవుంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, సీఎంగా బాధ్యలు స్వీకరించే విజయ్‌ (Vijay) కు అభినందనలు తెలిపారు. సినిమాపై తనకు అమితమైన ఆసక్తి ఉండన్నారు. అయితే, విజయ్ స్థానాన్ని తాను భర్తీ చేస్తానా లేదా అన్నది తెలియదని లెజెండ్ శరవణన్ అన్నారు.

అయితే 2022లో ది లెజెండ్ (The Legend) సినిమాతో వ‌చ్చిన శ‌ర‌వ‌ణ‌న్ నాలుగేండ్ల విరామం త‌ర్వాత ఇటీవ‌ల లీడ‌ర్ (Leader) అనే మూవీతో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి విజ‌యాన్ని అందుకున్నాడు. త్వ‌ర‌లోనే మ‌రో సినిమాకు రెడీ అవుతున్నాడు.

Updated Date - May 08 , 2026 | 11:36 AM