Sreeleela: అన్నీ భాషల్లో.. మాట్లాడేందుకు కృషి చేస్తున్నా
ABN , Publish Date - May 31 , 2026 | 10:06 PM
తాను అన్ని ప్రాంతీయ భాషల్లో మాట్లాడేందుకు కృషి చేస్తున్నట్టు హీరోయిన్ శ్రీలీల వెల్లడించారు.
తాను అన్ని ప్రాంతీయ భాషల్లో మాట్లాడేందుకు కృషి చేస్తున్నట్టు హీరోయిన్ శ్రీలీల (Sreeleela) వెల్లడించారు. తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల.. శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’తో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నా సినీ కెరీర్ కన్నడ సినిమాతో ప్రారంభమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తున్నాను.
నేను తెలుగు కుటుంబానికి చెందిన యువతి అయినప్పటికీ ఇంగ్లీష్, హిందీ, కన్నడ భాషలను మాత్రమే కాకుండా, ఇపుడు తమిళంలో కూడా మాట్లాడుతున్నాను. ఆయా ప్రాంతీయ భాషలను నేర్చుకుని మాట్లాడటం అనేది ఆయా ప్రాంతాల సంస్కృతులకు గొప్పగా భావిస్తున్నాను. పైగా ఒక భాషా చిత్రంలో నటిస్తుంటే ఆ భాషలోనే మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నాను. ఇలా చేయడం ఆ భాషకు నేను ఇచ్చే గౌరవంగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు.