Trisha: ప్రశాంతంగా నిద్రపోవాలంటే.. 2062 వరకు ఆగాల్సిందే

ABN , Publish Date - May 01 , 2026 | 09:43 AM

తాను ప్రశాంతంగా నిద్రపోవాలంటే 2062 వరకు ఆగాల్సిందేమో అంటూ హీరోయిన్ త్రిష చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Trisha

తాను ప్రశాంతంగా నిద్రపోవాలంటే 2062 వరకు ఆగాల్సిందేమో అంటూ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా తన నిద్రతో పాటు వ్యక్తిగత విషయాలపై ఓ పోస్ట్ చేశారు.

'నేను గంట నిద్ర కోల్పోతే దాని నుంచి కోలుకోవడానికి నాలుగు రోజులు పడుతుంది. ఈ లెక్కన నేను మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోవాలంటే 2062 వరకు ఆగాల్సిందేమో' అంటూ కామెంట్స్ చేశారు.

ఈ వ్యాఖ్యలు ఆమె సరదాగా చేసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయ్యాయి. పలు చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. ఆమె వ్యక్తిగతంగా పలు విమర్శలకు, ట్రోల్స్‌కు గురవుతున్నారు.

ఈ కారణంగానే ఆమె తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం వల్లే ఇలా వ్యాఖ్యానించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇదిలాఉంటే.. త్రిష ప్ర‌స్తుతం సూర్య కురుప్పు, చిరంజీవి విశ్వంభ‌ర సినిమాల్లో క‌థానాయిక‌గా చేస్తోంది.

Updated Date - May 01 , 2026 | 10:02 AM