Kayadu Lohar: మహిళలను.. అసభ్యంగా, ఆట వస్తువుగా చూపించే పాత్రలు చేయను
ABN , Publish Date - Sep 07 , 2026 | 07:40 AM
హీరోయిన్లను కేవలం ఆట వస్తువుగా, తెరపై గ్లామరస్ గా, చూపించే పాత్రలను అంగీకరించనని ప్రముఖ నటి కయదు లొహర్ అన్నారు.
హీరోయిన్లను కేవలం ఆట వస్తువుగా, తెరపై గ్లామరస్ గా, చూపించే పాత్రలను అంగీకరించనని ప్రముఖ నటి కయదు లొహర్ (Kayadu Lohar) అన్నారు. ఆమె నటించిన 'ఇమ్మెర్జల్', 'ఐమ్ గేమ్' చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'మహిళలను ఆటవస్తువుగా చూపించే పాత్రల్లో నటించేందుకు అంగీకరించను. అలాగే హీరోయిన్లను అసభ్యంగా చూపించే పాత్రలకు కూడా దూరంలో ఉంటాను. కథ, పాత్రకు అవసరమైతే, ఆ పాత్ర నమ్మశక్యంగా ఉందని భావిస్తేనే కొంతమేరకు కాంప్రమైజ్ అవుతాను.
అంతేకానీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు మాత్రమే పాత్రలను ఎంచుకోను. కొన్ని పాత్రలు చేయడం వల్ల సోషల్ మీడియాలో ట్రెండ్ కావొచ్చు, కానీ, ఆ ఆలోచన నాకు ఏమాత్రం సౌకర్యవంతంగా ఉండదు. అలాంటి పాత్రలు ఎన్నటికీ ఎంచుకోను' అని ఆమె స్పష్టం చేశారు. ఇదిలావుంటే, కోలీవుడ్ ఆడియన్స్ నుంచి ఆమె తాజాగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'ఇమ్మోరల్' మూవీ ప్రచారానికి దూరంగా ఉన్న ఆమె దుల్కర్ సల్మాన్ నించిన 'ఐమ్ గేమ్' సినిమా ప్రమోషన్‌లో పాల్గొనడమే ఈ ట్రోల్స్‌కు కారణంగా నిలిచింది. ఇదిలావుంటే, ఈ భామ చేతిలో 'ప్యారడైజ్, 'సూర్య48' చిత్రాలున్నాయి.