సమాజం తృప్తి కోసం పెళ్లి చేసుకోను

ABN , Publish Date - Feb 12 , 2026 | 09:45 AM

ఈ సమాజాన్ని తృప్తి పరిచేందుకు గాను నేను పెళ్ళి చేసుకునే ప్రసక్తే లేదని ప్రముఖ హీరో శింబు వెల్లడించారు.

silambarasan

ఈ సమాజాన్ని తృప్తి పరిచేందుకు గాను తాను పెళ్ళి చేసుకునే ప్రసక్తే లేదని ప్రముఖ హీరో శింబు (Silambarasan TR) వెల్లడించారు. తమిళ చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ హీరోగా గుర్తింపు పొందిన శింబు ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు టి. రాజేందర్ (టీఆర్) కుమారుడు. శింబుకు వివాహం చేయాలని టీఆర్ దంపతులు పెద్ద పోరాటమే చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శింబు తన వివాహం గురించి మాట్లాడుతూ.. 'మొబైల్ ఫోన్ విప్లవం వచ్చిన తర్వాత మనుషుల భావోద్వేగాలు మారిపోయాయి. ఎంత వేగంతో ప్రేమలో పడుతున్నారో అంతే వేగంతో విడి పోతున్నారు. నా వరకు వివాహం అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్న నియమ‌మేమీ లేదు. మనో రీతిగా సిద్ధం కావాలి. అప్పుడు మాత్ర‌మే వివాహం చేసుకోవాలి. ఈ సమాజాన్ని తృప్తి పరిచేందుకు వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు' అని అభిప్రాయపడ్డారు.

Updated Date - Feb 12 , 2026 | 10:40 AM