Janani Ashok Kumar: వారితో.. నాకు ఏ సంబంధం లేదు! రూ.634 కోట్ల కుంభకోణం కేసుపై.. నటి జనని క్లారిటీ

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:51 AM

రూ.634 కోట్ల ఉద్యోగాల అవినీతి కేసులో తన పేరు ముడిపెట్టడంపై బుల్లితెర నటి జనని అశోక్ కుమార్ స్పందించారు.

Janani Ashok Kumar

డీఎంకే (DMK) ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల పేరుతో రూ.634 కోట్ల మేర మోసగించారని మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ (K.N. Nehru.) పై నమోదైన ఆవినీతి కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని బుల్లి తెరనటి జనని అశోక్ కుమార్ (Janani Ashok Kumar) స్పష్టం చేసింది. నగరపాలక శాఖలో ఏఈ, జేఈ పోస్టులకు గాను రూ.634 కోట్లకు పైగా లంచం తీసుకున్నారనే ఆరోపణలపై క్రైం పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ భారీ కుంభకోణంలో బుల్లితెర నటిమ‌ణులు జనని, స‌బానా షాజ‌హాన్ (Shabana Shajahan)ల‌కు సంబంధం ఉన్నట్లు రెండు రోజులుగా సోషల్ మీడియాలో వీడియో, ఆడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నెహ్రూ అవినీతి కేసుతో తన పేరు ముడిపెట్టడాన్ని ఖండిస్తూ నటి జనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేర‌కు సామాజిక మాధ్య‌మం వేదిక‌గా ఓ లెట‌ర్ విడుద‌ల చేశారు.

Janani Ashok Kumar

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి రకరకాల తప్పుడు సమాచారాలు, అసత్య కథనాలు ప్రచారంలో ఉన్నాయని, మాజీ మంత్రి అవినీతి కేసుతో తన పేరు ముడిపెడుతున్నారని మండిపడ్డారు. ఈ అవినీతికి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏ రాజకీయ పార్టీతోనూ తనకు సంబంధాలు లేవని, రాజకీయ నేతలెవరూ తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ఇకపై సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు సమాచారం వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.

Updated Date - Nov 02 , 2026 | 01:15 PM