Soori: నేను.. వెట్రిమారన్ నాటిన విత్తును

ABN , Publish Date - Aug 31 , 2026 | 09:04 AM

తాను దర్శకుడు వెట్రి మారన్ (Vetrimaaran) నాటిన విత్తనాన్ని అని, ఆ చెట్టు ఎంతటి తుఫాను వచ్చిన తట్టుకుని బలంగా నిలబడి ఉంటుందని హీరో సూరి (Soori) అన్నారు.

Mandaadi soori

తాను దర్శకుడు వెట్రి మారన్ (Vetrimaaran) నాటిన విత్తనాన్ని అని, ఆ చెట్టు ఎంతటి తుఫాను వచ్చిన తట్టుకుని బలంగా నిలబడి ఉంటుందని హీరో సూరి (Soori) అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మండాడి (Mandaadi). తెలుగు యంగ్ హీరో సుహాస్ (Suhas) ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా మ‌హిమా నంబియార్ క‌థానాయుక‌. ఆర్ఎస్ ఇన్ఫో టైనమెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ (Elred Kumar) నిర్మించారు. మదిమారన్ పుగళేంది (Mathimaran Pugazhendhi) దర్శకుడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక తాజాగా చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకులు వెట్రిమారన్, ఆర్జే బాలాజీ, చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో సూరి మాట్లాడుతూ, 'ఇపుడు ఈ స్థాయిలో ఉండ టానికి ప్రధాన కారణం దర్శ కుడు వెట్రిమారన్. నాకు లభించే గౌరవం, ప్రతిష్ట అన్నీ ఆయనకే చెందుతాయి. ఎంతటి తుఫాను వచ్చినా ఆయన నాటిన విత్తనం మొల కెత్తుతూనే ఉంటుంది. విరిగి పోకుండా నిలబడే ఉంటుంది. సంగీత దర్శకుడు ఇళయరాజా చిన్నాపెద్దా అని చూడకుండా ప్రతి హీరో చిత్రానికి సంగీతం అందిస్తారు. అలాగే, జీవీ ప్రకాష్ కుమార్ కూడా అందరికీ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో రిస్క్ లేదు. కానీ, రిస్క్‌నే సవాల్‌గా తీసుకుని దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

రామనాథ పురం చుట్టుపక్కల ప్రజలు ఒక్క రోజు లేకపోయినా ఈ చిత్రం వచ్చేది కాదు. నా కుటుంబం నాతోనే ఉంది. నేను ఇంతదూరం రావడానికి, ఇక్కడ నిలబడటానికి నా కుటుంబమే కారణం. ఒకపుడు రూ.300 అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు లేవని, కానీ, ఇపుడు నా బిడ్డ కోసం ఎంతో మంది పోస్టర్లు వేస్తున్నారంటూ మా అమ్మ భావో ద్వేగానికి గురయ్యారు. మా అమ్మే నా జీవితం. ఆమె నా యజమానురాలు. ఆమెకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు' అని పేర్కొన్నారు. ఆ తర్వాత తన తల్లిని వేదికపైకి పిలిచి మాట్లాడించారు. 'నా బిడ్డ ఈ స్థాయికి రావడానికి ఇంత కష్ట పడతాడని ఊహించలేదు. ఈ సమయంలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఒకపుడు నీళ్ళు తాగి పడుకున్న సూరి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడంటే నేను నమ్మలేకపోతున్నాను' అంటూ ఆమె కన్నీరుపెట్టుకున్నారు..

Updated Date - Aug 31 , 2026 | 09:13 AM