Suriya: ‘కరుప్పు’లో నేను హీరో కాదు
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:30 AM
ఆర్‌జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో రూపొందిన ‘కరుప్పు’లో (Karuppu) తాను హీరోను కాదని హీరో సూర్య అన్నారు
ఆర్‌జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో రూపొందిన ‘కరుప్పు’లో (Karuppu) తాను హీరోను కాదని, కరుప్పు స్వామే కథానాయకుడని హీరో సూర్య (Suriya) అన్నారు. త్రిష (trisha) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్ర ఆడియోను మదురై వేదికగా తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ ‘నాకు మదురై చాలా ప్రత్యేకం. ఈ ప్రాంత సంప్రదాయాలు, ఆహారం, రాజకీయాలు, దైవాల పట్ల గొప్ప భావం ఉంది. ఈ మదురై గడ్డకు నేను ఎంతగానో రుణపడి ఉంటా. ఇక్కడ చాలా చిత్రాల షూటింగులు చేశా. 28 యేళ్లుగా మదురై ప్రజల ప్రేమ, ఆప్యాయతలే నన్ను హీరోగా నిలబెట్టాయి. ఇది నాకు ఆనందాన్నిస్తోంది. మదురై చిత్తిరై వేడుకలను తిలకించేందుకు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారు. అలాంటి సమయంలో ఈ చిత్ర ఆడియోను మదురైలో రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా తొలి భాగం ఎమోషనల్‌గా సాగుతుందని, రెండో భాగం ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందన్నారు. వచ్చే నెల 14వ తేదీన థియేటర్లలో కలుసుకుందాం’ అని పేర్కొన్నారు.