Huma Qureshi: అంతమంది ఉన్నారంటే ఏదో విషయం ఉన్నట్లేగా..
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:48 PM
‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా పాపులర్ స్టార్ అయ్యారు యశ్(Yash). ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic) . గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు
‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా పాపులర్ స్టార్ అయ్యారు యశ్(Yash). ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic) . గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో కియారా అడ్వానీ, నయనతార, తారా సుతారియ, హ్యూమా ఖురేషీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఫీమేల్ గ్యాంగ్ క్యారెక్టర్స్‌ను రివీల్ చేశారు. ఇందులో ఒక్కో హీరోయిన్‌కి ఒక్కో తరహా పాత్ర అని మేకర్స్ చెబుతున్నారు. అయితే కథానాయికల్లో ఒకరైన హ్యూమా ఖురేషీ ఛాన్స్ దొరికిన ప్రతిసారీ.. సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెబుతూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

‘టాక్సిక్’ ఆమె కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఆమె ఇటీవల ఓ వేదికపై ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో చాలామంది లేడీస్టార్స్ నటిస్తున్నారని, అంతమంది ఈ చిత్రంలో ఉన్నారంటే సినిమాలో ఏదో విషయం ఉన్నట్లేగా, అదేంటో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలని ఆమె అన్నారు. అంతే కాదు ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని తెలిపారు. ఈ సినిమాకు పని చేసిన అందరూ అద్భుతమైన ప్రతిభ కనబర్చారని, అందరికీ మంచి గుర్తింపు వస్తుందని తెలిపి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.