ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో జీవీ ప్రకాశ్‌ మూవీ...

ABN , Publish Date - Apr 16 , 2026 | 06:05 PM

జీవీ ప్రకాశ్‌ కుమార్‌, 'జో' ఫేమ్‌ హరిహరన్‌ రామ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంది. మాళవిక మనోజ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశే సంగీతం అందిస్తున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌ కుమార్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'జో' మూవీ ఫేమ్‌ హరిహరన్‌ రామ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో 'కరుడన్‌, మామన్' చిత్రాలను నిర్మించిన లార్క్ స్టూడియోస్‌ సంస్థకు ఇది మూడో సినిమా. దీన్ని ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ తో కలిసి నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ శరవేగంగా జరుగుతోందని, ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించడంతో పాటు జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతాన్ని కూడా అందిస్తున్నారని నిర్మాతలు తెలిపారు.


హరిహరన్‌ రామ్ దర్శకత్వం వహించిన 'జో' సినిమా దర్శకుడిగా అతనికి మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా కమర్షియల్‌ సక్సెస్‌నూ అందించింది. అందులో హీరోయిన్‌గా నటించిన మాళవిక మనోజ్‌... ఈ తాజా చిత్రంలో జి. వి. ప్రకాశ్‌ కుమార్‌ సరసన నటిస్తోంది. 'కర్ణన్‌, వాళై' చిత్రాలకు వర్క్ చేసిన తేని ఈశ్వర్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల గురించి వివరాలు మేకర్స్ తెలియజేయనున్నారు. ఈ సినిమా జూన్‌లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది.

Updated Date - Apr 16 , 2026 | 06:05 PM