GV Prakash: సంగీత దర్శకుడిగా సంతకం చేసి.. హీరోగా

ABN , Publish Date - Aug 25 , 2026 | 08:34 AM

ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ (GV Prakash Kumar) హీరోగా ‘నింజా’ పేరుతో కొత్త చిత్రం తెరకెక్కనుంది.

ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ (GV Prakash Kumar) హీరోగా ‘నింజా’ పేరుతో కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమం సోమవారం చెన్నైలో జరిగింది. మురుగు దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ఒక పూర్తిస్థాయి రొమాంటిక్‌ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారు. తొలి దశ షూటింగ్‌ తంజావూరులో 20 రోజుల పాటు  జరగనుంది.  చిత్రీకరణ కూడా పూజా కార్యక్రమంతోనే ప్రారంభమైంది. 2 జీవీ ప్రకాష్‌, సీన్‌ రోల్డన్‌ కలిసి పనిచేస్తున్న తొలి చిత్రం కావడం గమనార్హం. నిజానికి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా సంతకం  చేసిన జీవీ ప్రకాష్‌ ఏకంగా కథానాయకుడిగా నటిస్తున్నారు.

‘తలైవర్‌ తంబి తలమైయిల్‌’, ‘లవ్‌టుడే’, ‘పార్కింగ్‌’ వంటి చిత్రాల్లో తన నటనతో ప్రశంసలు అందుకున్న ప్రార్థన హీరోయిన్‌గా నటిస్తోంది. సోల్జర్స్‌ ఫ్యాక్టరీ, లెర్న్‌ అండ్‌ టీచ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎస్‌.సాయి దేవానంద్‌, కేఎస్‌ సినీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇతర పాత్రల్లో జెన్సస్‌ దివాకర్‌, రాధారవి, దీపా రామానుజం, దేవదర్శిని, కళ్యాణి నటరాజన్‌ తదితర తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు

Updated Date - Aug 25 , 2026 | 08:42 AM