జీవీ ప్రకాష్, గౌతమ్ మేనన్ ప్రధాన పాత్రల్లో హారర్ మూవీ.. ‘13’ ఫస్ట్ లుక్ రిలీజ్

ABN , Publish Date - Nov 02 , 2026 | 03:38 PM

జీవీ ప్రకాష్ కుమార్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ ‘13’. వివేక్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది

13 movie

ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar), ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon) ప్రధాన పాత్రల్లో నటించిన హార్రర్ చిత్రానికి 13 అనే పేరు పెట్టారు. భవ్య త్రిఖ (Bhavya Trikha), ఆదిత్య కదిర్ (Aditya Kathir), ఐశ్వర్య (Aishwarya), ఆధ్య ప్రసాద్ (Aadhya Prasad) తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మద్రాస్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కె దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

13 movie

ఈ సంద‌ర్భంగా దర్శకుడు వివేక్ (Vivek K) మాట్లాడుతూ.. 'ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా దట్టమైన అడ‌విలో చీకటిలో దాగివున్న 13 సంఖ్యకు సంబంధించిన రహస్యం నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింద‌ని అన్నారు. డిసెంబరులో మూవీని త‌మిళంతో సాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని పేర్కొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 03:50 PM