డిమాంటి కాలనీ3.. లైబ్రేరియ‌న్ ఫ‌స్ట్ లుక్ అదిరింది

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:41 PM

అరుళ్‌నిధి హీరోగా రూపొందుతున్న ‘డిమాంటి కాలనీ-3’లో ప్రముఖ నటుడు గురు సోమసుందరం ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

Demonte Colony 3

అజయ్‌ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వంలో అరుళ్‌నిధి (Arulnithi) హీరోగా రూపొందుతున్న ‘డిమాంటి కాలనీ-3’(Demonte Colony 3) లో ప్రముఖ నటుడు గురు సోమసుందరం (Guru Somasundaram) ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రాన్ని సుధన్‌ సుందరం, మనీష్‌ సింఘాల్‌, దుర్గారామ్‌ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమా విశేషాలను దర్శకుడు వివరిస్తూ, ‘డిమాంటి కాలనీ’ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగంలోని ‘ది లైబ్రేరియన్‌’ పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విలన్‌ పాత్ర పూర్తిగా ప్రతీకారేచ్ఛతో రగలిపోతూ, అత్యంత క్రూరంగా ఉంటుంది. సమాజంలో పైకి మాత్రం ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిలా కనిపిస్తూ, ఎపుడైనా క్రూరంగా మారగల స్వభావం కలిగిన నటుడు అవసరం.

ఈ తరహా హావభావాలు పలికించగలిగే నటుడు గురుసోమసుందరం మాత్రమే. అందుకే ఆయనను విలన్‌గా ఎంపిక చేశాం. ఇతర పాత్రల్లో ప్రియా భవానీ శంకర్‌, జీఎం కుమార్‌, ముత్తుకుమార్‌, శ్రీకుమార్‌, మీనాక్షి గోవిందరాజన్‌, కదిర్‌, ఆషిక్‌ హుస్సేన్‌ తదితరులు నటించారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం. థియేటర్లలో సందడి చేయడానికి సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ చేయనున్నాం’ అని వివరించారు.

Updated Date - Mar 21 , 2026 | 12:42 PM