GattaKusthi2: మూవీ సక్సెస్.. హీరోకు BMW, టీమ్‌కు గోల్డ్ చైన్స్, వెండి కాయిన్స్ పంచిన నిర్మాత
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:15 PM
విష్ణు విశాల్ గట్టా కుస్తీ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం గట్టా కుస్తీ 2. ఈ నెల జూలై 3న థియేటర్లకు వచ్చిన ఈ మూవీ అన్ని చోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతుంది.
విష్ణు విశాల్ (Vishnu Vishal), ఐశర్య లక్ష్మి (Aishwarya Lekshmi) జంటగా గతంలో వచ్చిన గట్టా కుస్తీ (Gatta Kusthi) సినిమాకు సీక్వెల్‌గా చెల్ల అయ్యవు (Chella Ayyavu) దర్శకత్వంలో రూపొందిన చిత్రం గట్టా కుస్తీ 2 (Gatta Kusthi 2). ఈ నెల జూలై 3న థియేటర్లకు వచ్చిన ఈ మూవీ అన్ని చోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతుంది. రిలీజ్ అయి వారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రెండో వారంలోనూ విజయవంతంగా రన్ అవుతోంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా గురువారం చెన్నైల్ థ్యాంక్స్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ ఇషారి కె. గణేష్ సినిమా యూనిట్ అందరికి 40 గ్రాముల సిల్వర్ కాయిన్స్, దర్వకుడు చెల్ల అయ్యవుకు 10 గ్రాముల బంగారు చైన్, బ్రాస్‌లెట్ బహుమతిగా అందజేశారు. అంతేగాక ఈ సినిమా హీరో విష్ణు విశాల్‌కు కూ.కోటి విలువైన BMW 3 కారును గిఫ్ట్‌గా ఇచ్చారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా హల్‌చల్ చేస్తున్నాయి. అయితే.. రెండేండ్ల క్రితం మట్టీ కుస్తీ పేరుతో తెలుగులోనూ రిలీజ్ అయిన ఈ ఈ సినిమా ఇక్కడా ఫర్వాలేదనిపించుకుంది. కాగా ఇప్పుడు మట్టీ కుస్తీ 2 రిలీజ్ ఉంటుందా ఉండదా అనేది తెలియాల్సి ఉంది.