ఘ‌నంగా ఉపేంద్ర వార‌సుడి ఎంగేజ్‌మెంట్‌ (ఫొటోలు వైర‌ల్)

ABN , Publish Date - May 26 , 2026 | 11:01 AM

సీతాప‌య‌నం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసి ఆక‌ట్టుకున్న హీరో నిరంజ‌న్ సుధీంద్ర.

Niranjan Sudhindra

ఈ ఏడాది ప్ర‌ధ‌మార్థంలో సీతాప‌య‌నం (Seetha Payanam) అనే సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసి ఆక‌ట్టుకున్న హీరో నిరంజ‌న్ సుధీంద్ర (Niranjan Sudhindra). క‌న్న‌డ రియ‌ల్ స్టార్‌ ఉపేంద్ర (Upendra) అన్న కుమారుడైన నిరంజ‌న్ 2018లో సెకండ్ హాఫ్ అనే క‌న్న‌డ సినిమాతో తెరంగేట్రం చేసి మంచి విజ‌యం అందుకున్నాడు. ఆపై మ‌రో ఒక‌టి రెండు సినిమాలు చేసిన నిరంజ‌న్ ఆపై స్టార్ హీరో అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సీతా ప‌య‌నం సినిమాలో హీరోగా టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు.

అయితే.. ఇప్పుడు ఈ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ క్ర‌మంలో సోమ‌వారం త‌న స్నేహితురాలు డాక్ట‌ర్‌ సంజ‌నా రాజ్ (Sanjana) తో బెంగ‌ళూరులో స‌న్నిహితుల స‌మ‌క్షంలో నిశ్చితార్థం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఉపేంద్ర, ప్రియాంక దంప‌తులు హ‌జ‌రై నూత‌న జంట‌ను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Niranjan Sudhindra

Niranjan Sudhindra

Updated Date - May 26 , 2026 | 12:02 PM