Natalie Burn: టాక్సిక్.. కారులో యశ్ తో రొమాన్స్ చేసిన ఈ భామ ఎవరో తెలుసా
ABN , Publish Date - Jan 09 , 2026 | 09:45 PM
సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు.. ఎవరు.. ఎలా పాపులర్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్లు.
Natalie Burn: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు.. ఎవరు.. ఎలా పాపులర్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్లు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్ర చేసినా కూడా వారు ఓవర్ నైట్ స్టార్స్ గా మారతారు. అయితే కొన్నిసార్లు ఓవర్ నైట్ స్టార్స్ హీరోయిన్లే కానక్కర్లేదు అని నిరూపించింది నటాలీ బర్న్ (Natalie Burn). ఎవరీమె.. పేరు ఎక్కడా వినలేదే అనుకుంటున్నారా.. ? కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) తాజాగా నటిస్తున్న చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెల్సిందే.
ఇప్పటికే ఐదుగుర హీరోయిన్ల పోస్టర్స్ రిలీజ్ అయ్యి మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇక తాజాగా యశ్ పుట్టినరోజు కానుకగా టేకింగ్ నుంచి రాయ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో యశ్.. కారులో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. కారులో యశ్ రొమాన్స్ చేస్తున్న అమ్మాయే నటాలీ బర్న్. గ్లింప్స్ రిలీజ్ అయ్యాకా ఈ చిన్నది ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయింది. యశ్ తోనే రొమాన్స్ చేసింది.. ఎవరా నటి అని ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టి.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకొని షాక్ అవుతున్నారు.
నటాలీ బర్న్.. ఒక అమెరికన్- ఉక్రెయిన్ నటి. హాలీవుడ్ లో యాక్షన్, థ్రిల్లర్ మూవీస్ లో నటించి మెప్పించింది. అమ్మడు కేవలం నటి మాత్రమే కాదు.. మార్షల్ ఆర్ట్స్ లో మంచి పేరు కూడా దక్కించుకుంది. అంతేనా నిర్మాతగా కూడా పలు సినిమాలను తెరకెక్కించింది. ఇంకొక విశేషం ఏంటంటే.. టాక్సిక్ కి సహా నిర్మాతగా కూడా నటాలీ వ్యవహరిస్తుందని టాక్. మొట్ట మొదటి సారి తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో నటిస్తుంది. మరి ఈ సినిమా నటాలీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలంటే మార్చి 19 వరకు ఆగాల్సిందే.