విజయ్ కన్నా ముందు త్రిష ఎంతమందితో ప్రేమలో పడిందో తెలుసా

ABN , Publish Date - Mar 06 , 2026 | 09:33 PM

త్రిష కృష్ణన్ (Trisha Krishnan).. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన త్రిష తెలుగులో వర్షం సినిమాతో హీరోయిన్ గా మారారు.

Trisha Krishnan

త్రిష కృష్ణన్ (Trisha Krishnan).. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన త్రిష తెలుగులో వర్షం సినిమాతో హీరోయిన్ గా మారారు. మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకొని వరుస అవకాశాలను అందుకున్నారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో నటించి నెంబర్ 1 హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ, ప్రభాస్,ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోస్ పక్కన ఆమె నటించి మెప్పించారు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే తమిళ్ లో కూడా తన సత్తా చాటారు.

ఇక తెలుగులో కొత్త హీరోయిన్లు రావడంతో ఆమె జోరు తగ్గించారు. తమిళ్ లో కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని 96 సినిమాతో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు త్రిష పెట్టింది పేరు. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారిన త్రిష పేరు కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమాల వలన త్రిషకు పేరు వచ్చిందో లేదో కానీ, ఆమె నడిపిన ప్రేమాయణాల వలన మాత్రం బాగా పేరు తెచ్చుకున్నారు. మొదటి నుంచి త్రిష చాలామంది హీరోలతో ఎఫైర్స్ నడిపారు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో త్రిష కొన్నేళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అప్పట్లో టాక్ నడిచింది. సింగర్ సుచిత్ర సుచీ లీక్స్ లో ఎక్కువ త్రిష ఫొటోలే బయటపడ్డాయి. ధనుష్ భార్య ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు ఇవ్వడానికి కారణం కూడా ఈమె అని కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. ధనుష్ తరువాత ఉదయనిధి స్టాలిన్ తో కూడా త్రిష రిలేషన్ షిప్ లో ఉందని రూమర్. వీరిద్దరూ కలిసి బయట కనిపించకపోయినా కూడా అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. త్రిషకు బిజినెస్ మ్యాన్ వరుణ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. అది పెళ్ళివరకు వెళ్ళలేదు. దానికి కారణం ఉదయనిధి స్టాలిన్ అని టాక్.

ఇక్కడితో త్రిష ఆగలేదు. సుచీ లీక్స్ లో ఆమె రానాతో కూడా కొన్నిరోజులు రిలేషన్ షిప్ లో ఉందని బయటపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఆ తరువాత ఒక ఆఫ్రికా వ్యక్తితో త్రిష కనిపించారు. ఎక్కడకు వెళ్లినా అతనితోనే కనిపించేవారు. అప్పట్లో ఈ జంట సెన్సేషన్ సృష్టించారు. ఆ ఆఫ్రికా వ్యక్తి డ్రగ్ డీలర్ అని సమాచారం. ఇక కోలీవుడ్ రొమాంటిక్ హీరో శింబుతో కూడా త్రిష డేట్ చేశారు. వీరిద్దరూ పెళ్ళి కూడా చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. ప్రస్తుతం త్రిష.. దళపతి విజయ్ తో రిలేషన్ లో ఉన్నారని సమాచారం. దీనివల్లనే విజయ్ భార్య సంగీత ఆయనకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డారని టాక్ నడుస్తోంది. విజయ్.. సంగీతకు భారీ భరణం ఆశచూపి పరస్పర విడాకులు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విడాకులు వచ్చేస్తే విజయ్ - త్రిష పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 06 , 2026 | 09:56 PM